
‘LEAD’ సంస్థ ఆధ్వర్యంలో విద్యకు సంబంధించిన అవగాహన కార్యక్రమం
‘LEAD’ సంస్థ ఆధ్వర్యంలో విద్యకు సంబంధించిన అవగాహన కార్యక్రమం
నంద్యాల (పల్లెవేలుగు) 10 డిసెంబర్: స్థానిక పట్టణంలోని పార్కు రోడ్డు సమీపంలో గల బాలా అకాడమీ పాఠశాలలో శనివారము LEAD సంస్థ ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు విద్యకు సంబంధించిన అవగాహన తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జి. చంద్ర శేఖర్ రెడ్డి (Regional Academic Expert) కె. అరుణ్ కుమార్ (Senior Area Manager ) కరస్పాండెంట్ ఎం.జి.వి. రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ మాధవీలత మరియు పాఠశాల సలహాదారిణి కామేశ్వరి అందరూ హాజరు అయ్యి జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగినది. ముఖ్య అతిధి అయిన జి. చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ మన విద్యా విధానంలో మారుతున్న కాలానుగుణంగా మన చిన్నారుల బంగారు భవిష్యత్తు కొరకు NEP విద్యా విధానం ప్రకారం ఇంటర్నేషనల్ స్టాండెడ్ ఎడ్యుకేషన్ (International Standed Education) అనుగుణంగా కమ్యూనికేషన్స్ స్కిల్స్ ను కోడింగ్ విధానాలను మరియు విద్యను పెంపొందించుకునే నైపుణ్యాలను అభివృద్ధి పరు చుటకు ఏర్పాటు చేయబడినది ఈ ‘LEAD’సంస్థ. ఇందులో చిన్నారుల కమ్యూనికేషన్ స్కిల్స్ అనగా (Spoken English) స్థాయిలను బట్టి వారికి లెవెల్స్ లను కేటాయించడం జరుగుతుంది. ఈ లెవెల్స్ 1 నుండి 21 వరకు ఉంటాయి. చిన్నారుల స్థాయిలను బట్టి ఆ లెవెల్స్ ల ను కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా మరెన్నో విషయాలను తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చక్కగా వివరించడం జరిగినది. మరియు పాఠశాల కరస్పాండెంట్ ఎం. జి.వి. రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ మాధవీ లత మాట్లాడుతూ మారుతున్న విద్యా విధానంలో మన చిన్నారుల భవిష్యత్తు ఆనందదాయకంగా ఉండాలి అంటే తప్పనిసరిగా కమ్యూనికేషన్ స్కిల్స్ లను అభివృద్ధి చేసుకోవాలి అని ఇంకా మరెన్నో విషయాలను అర్థమయ్యేలా తల్లిదండ్రులకు చక్కగా తెలియజేశారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన పేరెంట్స్ ఓరియంటల్ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు ఈ కార్యక్రమము విన్న తర్వాత తాము తమ చిన్నారుల బంగారు భవిష్యత్తుకి ఎలాంటి విధానాలను అనుసరించాలో మరియు పాటించాలో తెలుసుకొని ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్యమునకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.