
AISA ఉమ్మడి అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శిగా విజయ భాస్కర్ ఎన్నిక
AISA ఉమ్మడి అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శిగా విజయ భాస్కర్ ఎన్నిక
ధర్మవరం (పల్లె వెలుగు) ధర్మవరం పట్టణం లోని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఆలం జిల్లా ఉపాధ్యక్షులు ప్రతిభ, నరహసింహా హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో ధర్మవరం నియోజక వర్గానికి చెందినవారు విజయ భాస్కర్ ను జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గం లోని విద్యార్థి సమస్యలపై పోరాటం చేయాలని విద్యార్థులకు ఎక్కడైనా కానీ సమస్య ఉంది అంటే మన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ చేసిన అక్కడ ఉండి విద్యార్థుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి విజయ భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పైన రాజీలేని పోరాటం నిర్వహిస్తామని నాపై నమ్మకం ఉంచి నన్ను జిల్లా సహాయకార్యదర్శిగా ఎన్నుకున్నందుకు జిల్లా కమిటీకి ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఆలం అన్నగారికి విప్లవ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు హరి కృష్ణ, చంద్ర, సిన, అజయ్, సూర్య, మరియు విధార్థులు పాల్గొన్నారు