
9న వాల్మీకి మహర్షిని జయప్రదం చెయ్యండి – జిల్లా వాల్మీకి నేతలు
9న వాల్మీకి మహర్షిని జయప్రదం చెయ్యండి – జిల్లా వాల్మీకి నేతలు
నంద్యాల (పల్లెవేలుగు) 07 అక్టోబర్: ఈ నెల 9న ఆదివారం వాల్మీకి మహర్షి జయంతిని గ్రామ, గ్రామాన నిర్వహించి రాజకీయాల కతీతంగా ఐక్యతను చాటుదామని వాల్మీకి నంద్యాల జిల్లానేతలు వాల్మీకి బంధువులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉదయం బిసి వెల్ఫేర్ అధికారుల పిలుపు మేరకు నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో అధికారులతో మాట్లాడిన అనంతరం విఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయ పులికొండన్న, రాష్ట్ర కార్యదర్శి పరమటూరి శేఖర్, నియోజకవర్గ అధ్యక్షులు మదుగోపాల్, మహానంది మండల నాయకులు నారి, గాజులపల్లి జయరాం, నంద్యాల మండల నాయకులు, మాజీ సర్పంచ్ కాశన్న, పట్టణ విఆర్పీఎస్ సహాయ కార్యదర్శి మల్లికార్జున, విఆర్పీఎస్ విద్యార్థి నేత దగ్గడ్ సాయి, పట్టణ నాయకులు హరి, రవి, మధు, రమేష్ తదితరులు మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఏర్పడిన తరువాత మహర్షి జయంతి అధికారులు, నాయకులమధ్య జరుపటం మొదటి సారి అవుతుందని నంద్యాల జిల్లాలోని ప్రతి గ్రామంలో వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించు కోవాలని ఉదయం నంద్యాలలో జరిగే బైక్ ర్యాలీలో అధిక సంఖ్యలో వాల్మీకి బంధువులు పాల్గొనాలని మధ్యాహ్నం దేవనగర్ వాల్మీకి ఆలయం నందు భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగిందని కనుక అధిక సంఖ్యలో వాల్మీకి బంధువులు పాల్గొని జయంతిని జయప్రదం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు