nandyala

మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి కి సన్మాన కార్యక్రమం

మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి కి సన్మాన కార్యక్రమం

నంద్యాల (పల్లెవేలుగు) 02 ఫెబ్రవరి: ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్  రాష్ట్ర మీడియా సెక్రెటరీ గా ఎన్నిక అయిన జావిద్ ని అల్ మదాద్ కంప్యూటర్ సెంటర్ వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమములో ముఖ్య అతిథులుగా సయ్యద్ అసదుల్లా మియా మరియు చైర్మన్ ఆకుమల్ల రహీమ్ మాట్లాడుతూ జావిద్ గారు మంచి సేవా గుణం కలిగి స్వతహాగా ఒక పత్రికను స్థాపించి సామాజిక స్పృహ తో  సమాజంలో జరుగుతున్న విషయాలను ప్రజలకు చేర వేస్తున్న ఒక మంచి భావజాలం కల్గిన గొప్ప వ్యక్తి  అని ఇలాంటి వ్యక్తిని గుర్తించి అల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ వారు రాష్ట్ర మీడియా సెక్రెటరీ గా భాద్యతలు ఇవ్వడం ఆ సంస్థ ఆశయాలను ప్రజల దగ్గరికి చేర్చే అవకాశం ఇచ్చింది అని కొనియాడారు. అనంతరం జావిద్ మాట్లాడుతూ అల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ అనే సంస్థ జాతీయ సంస్థ అని ఈ సంస్థ ఆశయం వంద శాతం విద్యను ప్రజలందరికీ మతాలకు అతీతంగా అందజేయడం ప్రధాన లక్ష్యం అని తెలిపారు. మిల్లీ కౌన్సిల్ ద్వారా విద్యార్థులకు NEET, JEE, మరియు  సివిల్స్ కు సంబందించిన కౌచింగ్ ఉచితంగా ఇస్తూ మెరిట్ సాధించిన విద్యార్థులకు  ఉచితంగా చదివించే పని కూడా చేస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్ మదత్ ఫౌండేషన్ చైర్మన్ ఆకుమళ్ళ రహీమ్, మిల్లీ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు సయ్యద్ అసదుల్ల, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక నంద్యాల మండల ప్రధాన కార్యదర్శి శివ నారాయణ, ఉపాధ్యక్షుడు ఆరిఫ్, నంద్యాల టౌన్ కోశాధికారి సయ్యద్ మౌలాలి అల్ మదత్ కంప్యూటరు సెంటర్ ఇంచర్జ్ రహంతుల్లా, ఫ్యాకల్టీ అబ్దుల్ మజీద్, మరియు విద్యార్థులు పాల్గొన్నారు


hameedulla

Hameedulla.Shaik Reporter, Nandyal, Nandyal Dist
Back to top button