
73వ భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించిన నంద్యాల జిల్లా SDPI నాయకులు
73వ భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించిన నంద్యాల జిల్లా SDPI నాయకులు
నంద్యాల (పల్లెవేలుగు) 26 నవంబర్: SDPI పార్టీ నంద్యాల జిల్లా వైస్ ప్రెసిడెంట్ లింకన్ రాజు గారు మాట్లాడుతూ భారత ప్రభుత్వం నవంబర్ 26వ తేదీని దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తుంది భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చిన జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము అయితే భారత రాజ్యాంగ రచనను పూర్తి చేసుకొని రాజ్యాంగ రచన సంఘం రాజ్యాంగ పరిషత్తుల ఆమోదం పొందిన తర్వాత రాజ్యాంగ రచన సంఘం చైర్మన్ హోదాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1949 జనవరి 26వ తేదీ నాటి నేతలకు సమర్పించారు అని తెలియజేశారు. SDPI పార్టీ నంద్యాల జిల్లా ట్రెజరర్ మహమ్మద్ అలీ గారు మాట్లాడుతూ ఈ సందర్భంగా చారిత్రాత్మక ప్రాధాన్యతను భద్రపరిచి దేశ పునర్నిర్మాణంలో రాజ్యాంగ పాత్రతో పాటు ఆ రాజ్యాంగ రచనకు* *డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషికి గుర్తింపుగా రాజ్యాంగ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడంలో జరుగుతుంది రాజ్యాంగం అంటే కేవలం ప్రభుత్వ విధివిధానాలు చట్టసభల రూపకల్పన మాత్రమే కాదు కోట్లాది పీడిత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే గొప్ప సాధనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశించారు రాజ్యాంగం అంటే దేశానికి ప్రజలకు ప్రభుత్వానికి దిశా నిర్దేశం చేయగలిగే కరదీపికగా తీర్చిదిద్దేందుకు ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేశారని తెలియజేశారు.