kosigi

వాహనాల పెండింగ్ ట్యాక్స్ లు చెల్లించాలి

  • వాహనాల పెండింగ్ ట్యాక్స్ లు చెల్లించాలి
  • లేకపోతే చర్యలు తప్పవు ఆదోని ఆర్టీవో శిశిరా దీప్తి

కోసిగి వాహనాల పెండింగ్ ట్యాక్స్ చెల్లించి,పర్మీట్ కలిగి వాహనాలు నడుపుకోవాలి… లేకపోతే వాహనాలను సీజ్ చేస్తామని ఆదోని రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారిని శిశిర దీప్తి అన్నారు…శనివారం కోసిగిలో వాహనాలు తనిఖీలు చేపట్టి,అందులో మూడు వాహనాలకు సంబంధించి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో రెండు ట్రాక్టర్లు, ఒక లారీకి చలానా విధించారు…ఆదోని ఆర్టీవో శిశిర దీప్తి మాట్లాడుతూ వాహనదారులు ప్రతి ఒక్కరు లైసెన్స్ కలిగి ఉండాలని, అలాగే తమ వాహనాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న ట్యాక్స్లు చెల్లించి,ప్రతి ఒక్క వాహనానికి ఆల్ పర్మీట్ చేసుకోని వాహనాలు నడుపు కోవాలని ఆమె సూచించారు. అలాగే చిన్న పిల్లలకు నడపడానికి వాహనాలు ఇస్తే తమ తల్లిదండ్రులు జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని, ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి, ప్రయాణించాలి..పెండింగ్ లో ఉన్న టాక్స్లు గల వాహనాలు ఎటువంటి అదనపు రుసుము లేకుండా మీ సేవ కేంద్రంలోని తమ టాక్స్ లు చెల్లించుకోవాలని,అధికారుల దృష్టిలో పడినట్లయితే 200%  అదనంగా రుసుము చెల్లించుకోవాల్సి వస్తుందని ఆర్టీవో శిశిర దీప్తి అన్నారు…

Mohammad Yousuf

Mohammad Yousuf Reporter, Kosigi, Kurnool DIst
Back to top button