Yemmiganur

అభివృద్ధికి ఆద్యుడు కోట్ల,ఘనంగా కోట్ల విజయ భాస్కర రెడ్డి 102 వ జయంతి.

అభివృద్ధికి ఆద్యుడు కోట్ల,ఘనంగా కోట్ల విజయ భాస్కర రెడ్డి 102 వ జయంతి.

అభివృద్ధికి ఆద్యుడు కోట్ల,ఘనంగా కోట్ల విజయ భాస్కర రెడ్డి 102 వ జయంతి.

ఎమ్మిగనూరు (పల్లెవెలుగు) 16 ఆగష్టు:  పట్టణంలో మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి 102 వ జయంతి వేడుకలను మంగళవారం కోట్ల క్యాంపు కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు. ముందుగా నాయకులు  కోట్ల విజయ భాస్కర రెడ్డి చిత్ర పటమునకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంను రెండు కళ్లుగా భావించి ప్రగతి పథంలో ఎన్నో మైలురాళ్లు  సాధించి,పల్లె పల్లెకు తాగునీరు- సాగునీరు అందించడమే కాకుండా రోడ్లు, గృహాలు, విద్య, వైద్య, ఆరోగ్యం ప్రాధాన్యత ఇచ్చి రైతులకు భూమి హక్కు పత్రములను ఇచ్చిన ముఖ్యమంత్రి  భారతదేశంలోనే కోట్ల విజయభాస్కరరెడ్డి మొదటి వ్యక్తి అని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులకు, కె.సి. కెనాల్, ఎల్.ఎల్.సి. ఆధునీకరణ పనులకు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయించారని తెలిపారు. 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ గా,5 సార్లు శాసన సభ్యులుగా, ఒక సారి శాసనమండలి సభ్యులుగా, 6 సార్లు కర్నూల్ లోకసభ సభ్యుడు గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 2 సార్లు ముఖ్యమంత్రిగా,4 సార్లు కేంద్రమంత్రిగా   సేవలు అందించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. 1954,1955,1983 లలో  ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి మూడు సార్లు  శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించి ఎమ్మిగనూరు తో విడదీయరాని బంధం ఏర్పరుచుకున్నాడన్నారని తెలిపారు.దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి గారి జీవిత చరిత్రను పెద్దాయన  పేరుతో  కదిరికోట ఆదెన్న రచనలో  రూపొందిస్తున్నట్లు కోట్ల క్యాంప్ కార్యాలయం వెల్లడించింది.ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

K.Yallayya

K. Yallayya Reporter, Yemmiganuru,
Back to top button