
40 సంవత్సరాల తర్వాత పూర్తిగా నిండిన బీటీపీ డ్యాం
40 సంవత్సరాల తర్వాత పూర్తిగా నిండిన బీటీపీ డ్యాం
రాయదుర్గం (పల్లెవెలుగు) 19 సెప్టెంబర్: తాలూకాలోని గుమ్మగట్ట మండలంలో ఉన్న బీటీ బిడియం 40 సంవత్సరాల తర్వాత పూర్తిగా నిండడంతో డ్యాంకు సంబంధించిన అన్ని గేట్లను ఎత్తి నీటిని బయటకు వదలడం జరిగింది. ఇది ఇలా ఉండగా కనేకల్లు బొమ్మనహాలు మండలాల్లో ప్రవహిస్తున్న నదులు పూర్తిస్థాయిలో నిండి నది ప్రవాహక పరిధిలోగల గ్రామాల్లోనికి నీరు చొచ్చుకుపోవడం జరిగింది అదేవిధంగా మండల కేంద్రానికి గ్రామాలకు మధ్య నదులు ప్రవహిస్తుండడంతో ఆయా గ్రామాల ప్రజలు మండల కేంద్రంలోని కార్యాలయాలకు పనుల నిమిత్తం వెళ్లి రావాలంటే 8 లేదా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికి అటు కర్ణాటక బళ్లారి సరివేద్దు ప్రాంతానికి వెళ్లి మండల కేంద్రానికి దాదాపు 40 కిలోమీటర్లు మండల కేంద్రానికి ప్రయాణం చేయాల్సి వస్తోంది నది ప్రవాహానికి పక్కనున్న పంట పొలాలు కూడా కొట్టుకు పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు నష్టపోయిన పంటలను పరిశీలించి నష్టపరిహారం అందేలా చూడాలని రైతులు కోరుచున్నారు