
297 కోట్ల రూపాయలతో 138 గ్రామాల ప్రజల ఇంటింటికీ కొళాయి కనెక్షన్
- 297 కోట్ల రూపాయలతో 138 గ్రామాల ప్రజల ఇంటింటికీ కొళాయి కనెక్షన్
- జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్
- జల జీవన్ మిషన్ పథకం కింద 297 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
పాణ్యం (పల్లెవెలుగు) ఫిబ్రవరి 01 : పాణ్యం మండలంలోని గోరుకల్ రిజర్వాయర్ ఇంటేక్ వాల్ నుండి ఎస్సార్ బీసీ కెనాల్ వెంట 10 కిలోమీటర్ల మేర జరుగుతున్న పైప్లైన్ పనులను కలెక్టర్ పరిశీలించారు. జాతీయ రహదారి దగ్గర అండర్ గ్రౌండ్ లో నిర్మిస్తున్న పైప్ లైన్లను కూడా కలెక్టర్ పరిశీలిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే తమ్మరాజుపల్లె సమీపంలో బుగ్గానిపల్లి తాండ దగ్గర సరఫరా అయిన నీటిని శుద్ధి చేసే నిర్మాణాలు కూడా కలెక్టర్ పరిశీలించారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే డోన్ నియోజకవర్గం మూడు మండలాల్లోని 138 గ్రామాలతో పాటు డోన్, బేతంచర్ల మున్సిపాలిటీలకు కూడా ఇంటింటికి కొలాయి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని గ్రామీణ నీటి సరఫరా శాఖ కార్యనిర్వాక ఇంజనీర్ మనోహర్ కలెక్టర్ కు నివేదించారు. ఈ పథకం కింద 2 లక్షల 28 వేల మంది లబ్ధిదారుల కుటుంబాలకు మంచినీటి సదుపాయం కల్పించే అవకాశం ఉందన్నారు కార్యక్రమంలో తహశీల్దార్ మలికార్జున రెడ్డి, మండల అభివృద్ధి అధికారి, దస్తగిరి, మాజీ జడ్పీటీసీ సభ్యులు సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.