
Dharmavaram
28 కేజీల ప్లాస్టిక్ ను సీజ్ చేసి మున్సిపల్ అధికారులు
28 కేజీల ప్లాస్టిక్ ను సీజ్ చేసి మున్సిపల్ అధికారులు
ధర్మవరం (పల్లె వెలుగు) 05 సెప్టెంబర్: పురపాలక సంఘం సెప్టెంబర్ 5వ తేదీ కమిషనర్ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ నివారణా చర్యలలో భాగంగా ధర్మవరం పట్టణంలోని ప్రధాన కూడలియందు ప్రధాన రహదారుల యందు ప్లాస్టిక్ నివారణ చర్యలలో భాగంగా ప్లాస్టిక్ రైడ్ చేయడం జరిగినది. కమిషనర్ మల్లికార్జున, శానిటరీ ఇన్స్పెక్టర్ బాషా, మరియు శానిటేషన్ సెక్రెటరీస్ ఆధ్వర్యంలో సోమవారం పలు షాపుల యందు ప్లాస్టిక్ రైడింగ్ చేసి ప్లాస్టిక్ ను సీజ్ చేయడం జరిగినది అన్ని షాపులకి జరిమానాలు కూడా విధించడం జరిగినది. రైడింగ్ లో మొత్తం 28 కేజీల ప్లాస్టిక్ ను సీజ్ చేసి పదివేల నాలుగువందల రూపాయలను జరిమానా కూడా విధించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున తెలిపారు.