
11నైవేద్యాల మహిమ గల మసీదుపురం శ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి ముగిసిన శ్రావణ మాసం వేడుకలు.
11నైవేద్యాల మహిమ గల మసీదుపురం శ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి ముగిసిన శ్రావణ మాసం వేడుకలు.
కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు మండల పరిధిలోని మసీదుపురం గ్రామంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ ఆదేశాలు మేరకు ఈఓ పి. దినేష్ ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బంది కెవి.సుబ్బయ్య అచారి,గ్రామ పెద్దలు పాల్గొని ఏర్పాటు చేసిన శ్రావణ మాసం ఉత్సవాలు సందర్భంగా శ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి శ్రావణ మాసం వేడుకలు ఈ చివరి సోమవారం తో ఘనంగా ముగిశాయి. ఈసందర్భంగా ఆలయ అర్చకులు ఈరన్న స్వామి,నరసప్ప, నారాయణ స్వామి, గ్రామ సర్పంచ్ కె.రాముడు లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసం వచ్చిందంటే ఎక్కడా లేని విధంగా పదకొండు నైవేద్యాలు అందుకుని మదినిండా కొలిచిన వారికి కొంగు బంగారంగా వరాలిచ్చే దేవుడు మసీదుపురం శ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి అని తెలిపారు. అలాగే శ్రావణ మాసం లోని ఈ నాలుగు సోమవారాలు మా గ్రామం తో పాటు సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని,అత్యంత నియమ, నిష్టాలతో,భక్తీ శ్రద్ధలతో కొలుచుకుంటూ పదకొండు నైవేద్యాలను స్వామి వారికి సమర్పిస్టారని,ఈ శ్రావణ మాసం వరకు గ్రామంలో ఎటువంటి మద్యమాంసాదు లను దరిచేరణీయరని తెలిపారు. ఈరోజు చివరి సోమవారంతో శ్రావణ మాస ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు.అలాగే గ్రామానికి, వచ్చిన భక్తులకు తీవ్ర తాగునీటి సమస్య ఉందని,అధికారులు ఇప్పటికయినా స్పందించి శాస్వితంగా తాగునీటి సమస్య రాకుండా నివారించాలని గ్రామసర్పంచ్ రాముడు విజ్ఞప్తి చేశారు.వచ్చిన భక్తులకు కర్నూలు శ్రీశ్రీనరసప్ప స్వామి సేవాసమాజ్ వారు అన్నదానం చేశారు