Rayadurgam

హై టెన్షన్ విద్యుత్ తీగ తెగ బడి ఆరుగురు మహిళా వ్యవసాయ కూలీలు మృతి ఒకరి పరిస్థితి విషమం

హై టెన్షన్ విద్యుత్ తీగ తెగ బడి ఆరుగురు మహిళా వ్యవసాయ కూలీలు మృతి ఒకరి పరిస్థితి విషమం

రాయదుర్గం తాలూకాలోని బొమ్మనహాళ్ మండలం పరిధిలో దర్గా హోన్నూర్ గ్రామంలో బుధవారం విద్యుత్ తీగ తెగబడి ఆరుగురు మహిళ వ్యవసాయ కూలీలు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది వివరాల్లోకి వెళితే అదే గ్రామానికి చెందిన ఒక రైతు పొలంలో దాదాపు 30 మంది దాకా కూలి పనులకు వెళ్లడం జరిగింది పని ముగించుకున్న తర్వాత అదే రైతుకు చెందిన ట్రాక్టర్లో ఇంటికి వచ్చేందుకు బయలుదేరారు బయలుదేరే సమయంలో ఘాతుగానికి గురైన వారు ట్రాక్టర్లో ఉన్న సమయంలో పైనే ఉన్న ఐటెన్షన్ విద్యుత్ తీగ తెగి ట్రాక్టర్ ఫై పడడంతో అందులో ఉన్నవారు విద్యుత్ ఘాతగానికి గురయ్యారు ఇందులో వన్నక్క. రత్నమ్మ. పార్వతి. శంకరమ్మ లు వీరు నలుగురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ఆసుపత్రికి తరలించడం జరిగింది ఇందులో లక్ష్మి. సుంకమ్మ. రాజేష్ ల పరిస్థితి విషమంగా ఉండడంతో బళ్లారి విమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వీరిలో కూడా సుంకమ్మ. లక్ష్మి లు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించడంతో వారి మృతదేహాలను బళ్లారి విమ్స్ నందు పోస్టుమార్టం నిర్వహించడానికి ఉంచినట్టు తెలిపారు వీరిలో విషమంగా ఉన్న రాజేష్ అనే యువకునికి బళ్లారి విమ్స్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతున్నట్టు గ్రామస్తులు తెలిపారు ఈ ఘాతుకానికి సంబంధిత అధికారుల నిర్లక్ష్యమే కారణము అని గ్రామస్తులు అంటున్నారు గతంలో పలుచోట్ల ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు మండి పడుతున్నారు

anjineyulu

Anjinayalu Reporter, Rayadurgam, Anantapur Dist,
Back to top button