Yemmiganur

హెచ్‌ఐ‌వి ఎయిడ్స్ ఒక అంటువ్యాది కాదు అంటించుకునే వ్యాది..వైస్సార్సీపీ సీనియర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి,కమీషనర్ గంగిరెడ్డి.

హెచ్‌ఐ‌వి ఎయిడ్స్ ఒక అంటువ్యాది కాదు అంటించుకునే వ్యాది..వైస్సార్సీపీ సీనియర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి,కమీషనర్ గంగిరెడ్డి.

కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు పట్టణంలో విజయ మహిళా మండలి టి‌ఐ (సి‌సి) సి‌ఈఓ. ఓంకారం , ప్రాజెక్టు డైరెక్టర్. బి. వేణుగోపాలచారిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ హెచ్‌ఐ‌వి/ఎయిడ్స్ దినమునకు ముఖ్య అతిథులుగా వై‌ఎస్‌ఆర్‌సి‌పి నియోజకవర్గ సీనియర్ నాయకుడు  జగన్మోహన్ రెడ్డి పాల్గొని విద్యార్థులతో ర్యాలీని ప్రారంభించారు.ఈసందర్భంగా జగన్మోహన్ రెడ్డి,మున్సిపల్ కమీషనర్ గంగిరెడ్డి లు మాట్లాడుతూ హెచ్‌ఐ‌వి ఎయిడ్స్ పట్ల సమాజంలో అందరు తగుజాగ్రతలు పాటించాలని, హెచ్‌ఐ‌వి ఎయిడ్స్ వ్యాది గ్రస్తులు పట్ల సమానత్వం పాటించాలని ప్రజలకు అవగాహన కార్యక్రమంలో సూచించారు. సమాజంలో హెచ్‌ఐ‌వి ఎయిడ్స్ ఒక అంటువ్యాది కాదని,అంటించుకునే వ్యాది అని తెలిపారు

అనంతరం ర్యాలీని మాచాని బాలికల ఉన్నత పాఠశాల నుండి పోస్టాఫీస్, సోమప్ప సర్కిల్ వరకు నిర్వహించి సోమప్ప సర్కిల్ నందు విద్యార్థులచే మానవహారం ఏర్పాటు చేశారు.హెచ్‌ఐ‌వి/ఎయిడ్స్ నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు

ఈకార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్. జి దేవేంద్ర , ఎం‌ఈ‌సి‌ఏ. కే. పరమేష్ , వి‌ఎం‌ఎం సిబ్బంది,  యమ్మిగనూర్  సి‌హెచ్‌సి సుపరేంటెడ్. బాలాజి ,  గర్ల్స్ హై స్కూలు పిఈటి సృజన ,  వేణువిద్యాలయ సిబ్బంది, సచివాలయం ఏఎన్ఎంలు,వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు

K.Yallayya

K. Yallayya Reporter, Yemmiganuru,
Back to top button