
హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించి జయప్రదం చేసిన బాలాకాడమీ రవీంద్ర హై స్కూల్ విద్యాసంస్థలు
హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించి జయప్రదం చేసిన బాలాకాడమీ రవీంద్ర హై స్కూల్ విద్యాసంస్థలు
నంద్యాల (ఆంధ్రప్రతిభ) 10 ఆగష్టు: పట్టణంలోని సిల్వర్ వోక్స్ బాలకాడమీ రవీంద్ర హై స్కూల్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఆజాద్ కి అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించి జయప్రదం చేశారు ఈ ర్యాలీలో సిల్వర్ వోక్స్ బాలకాడమీ రవీంద్ర హై స్కూల్ కరెస్పాండెంట్ M.G.V రవీంద్రనాథ్, ప్రిన్సిపల్ మాధవీ లత నంద్యాల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఇషాక్ భాషా, ముఖ్యఅతిథిగా, అస్మా చైర్మన్ దస్తగిరి, నవనంది రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ డి.చంద్రశేఖర్, సెక్రెటరీ కే.నవీన్, అసిస్టెంట్ గవర్నర్ త్రివిక్రమ్, పడకండ్ల సుబ్రహ్మణ్యం- రవి కిండర్ గార్డెన్ కస్పాండెంట్ , విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం పాల్గొని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇషాక్ భాషా మాట్లాడుతూ సిల్వర్ వోక్స్ బాలాకాడమీ రవీంద్ర హై స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆజాద్ క అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీని పాఠశాల నుండి గాంధీ చౌక్ వరకు విద్యార్థులు ఉపాధ్యాయ బృందం మరియు వచ్చినటువంటి అతిధులు పాల్గొని నన్ను అందులో భాగంగా పాల్గొనేలా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనమందరము ఏకధాటిగా ఏకత్రాటిపై నడిపించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా మన భారతీయ జాతీయ జెండాను ఆగస్టు 13, 14, 15 తేదీలలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఎగరవేయాలని కోరడం జరిగినది ఈ అవకాశం కల్పించిన M.G.V రవీంద్రనాథ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బాలకాడమీ రవీంద్ర హై స్కూల్ కరస్పాండెంట్ M.G.V రవీంద్రనాథ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు హర్ ఘర్ తిరంగాను ఆజాద్ క అమృత్ మహోత్సవంలో భాగంగా మా పాఠశాల విద్యార్థులతో ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న అతిథులకు, ఎమ్మెల్సీ ఇషాక్ భాష కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పడం జరిగింది.
