
హత్య చేసిన నిందితులు అరెస్ట్
హత్య చేసిన నిందితులు అరెస్ట్
కోసిగి స్థానిక రెండవ వార్డులోని నాగన్న కట్ట వద్ద నివాసముంటున్న నాగన్నగేరి. ఈరయ్య అనే వ్యక్తి ని భార్య అళ్ళమ్మ , కుమారుడు కలిసి ఆదివారం 25వ తేదీ హత్య చేసినట్లు కోసిగి సిఐ ఏరిషావలి , ఎస్ఐ.రాజా రెడ్డి లు తెలిపారు. గురువారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుడు ఈరయ్య మందుకు బానిసై ఇంట్లో ప్రతిరోజు భార్య అళ్ళమ్మ తో,గొడవ పడి దాడి చేసేవాడని ,అదేవిధంగా మృతుని కుమారుడు చెడు వ్యసనాలకు బానిసై , అల్లరికిపడి , తిరగడంతో తండ్రి పలుమార్లు హెచ్చరించినా దారిలో రాకపోవటంతో , భార్య తో మరియు కుమారునితో తరచూ గొడవలు పడేవాడన్నారు. గత వారం రోజుల క్రితం కుమారున్ని కొట్టడంతో ఇంటిలో నుంచి అలిగి బయటికి వెళ్లిపోవడం జరిగిందని , అదే రోజు రాత్రి భార్యతో గొడవ పడటంతో పక్కనే ఉన్న నాగన్న కట్ట వద్ద రాత్రి నిద్రిస్తున్న సమయంలో, కుమారుడు వచ్చి బయట ఎందుకు పడుకున్నావు అని అడిగి తండ్రి గొడవ పడటం వల్లే తన తల్లి బయట పడుకోవడం జరిగిందని గ్రహించి , ఇంట్లో ఉన్న గొడ్డలితో తండ్రిని నరికి చంపడం జరిగిందన్నారు. ఈ హత్యలో భార్య అళ్ళమ్మ సైతం హత్యకు సహకరించినట్లు విచారణలో తేలిందన్నారు.హత్య చేసే సమయంలో వాడిన ఆయుధాలను స్థానిక బస్టాండ్ ప్రాంగణములో ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇరువురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి, కోర్ట్ కు తరలించడం జరిగిందన్నారు.