mahanandi

హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్టు

హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్టు

మహానంది (పల్లె వెలుగు) 13 సెప్టెంబర్: ఈ నెల నాలుగో తేదీ అర్ధరాత్రి మహానందిలో హత్యకు గురైన సంగటి రాము హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నంద్యాల రూరల్ సిఐ మహానంది పోలీస్ స్టేషన్ లో పేర్కొన్నారు. ఏ 1 బాబా ఫక్రుద్దీన్, ఎ2 సంగతి మధురేణుక, ఏ3 మండ్ల వేణు, ఏ4 అంకె  ప్రేమ్ కుమార్ లను మహానంది సమీపంలోని కాశినాయన ఆశ్రమం వద్ద ఉండగా అరెస్టు చేసినట్లు తెలిపారు. నంద్యాల డిఎస్పి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వీరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. .ఏ1మరియు ఏ2కు మధ్య ఉన్న వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండాగా ఉన్న కారణంచేత ఏ1 మరియు ఎ2 ప్రోద్బలంతో మిగిలిన నిందితులు కలిసి హత్య చేసినట్లు మృతుడి తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఒక అంగి మరియు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రవీంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహానంది ఎస్ ఐ నాగార్జున రెడ్డి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Back to top button