Dharmavaram

హంద్రీ- నీవా సాగునీటి రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం..

  • హంద్రీ- నీవా సాగునీటి రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం..
  • మార్చి చివరి వరకు సాగునీటి విడుదల కొరకు ఈనెల 28న రోడ్ల దిగ్బంధనం..
  • రైతులు వేలాదిగా తరలి రావాలని అఖిలపక్ష పార్టీలు పిలుపు..

దేవనకొండ (ఆంధ్ర ప్రతిభ) 23 నవంబర్: హంద్రీ-నీవా సాగునీటి రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈనెల 28 న రోడ్డు దిగ్బంధన కార్యక్రమానికి పిలుపునిస్తున్నట్లు ఈ కార్యక్రమాన్ని మండల రైతాంగం జయప్రదం చేయాలని అఖిలపక్ష పార్టీల నాయకులు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దిలేటి శెట్టి, సిపిఎం జిల్లా నాయకులు వీరశేఖర్, తెలుగుదేశం పార్టీ నాయకులు మండల కన్వీనర్ విజయ్ భాస్కర్ గౌడ్, నాయకులు ఉచ్చురప్ప, లోక్సత్తా పార్టీ నాయకులు రాందాస్ గౌడ్, ఎమ్మార్పీఎస్ నాయకులు లక్ష్మన్న, సుధాకర్, జనసేన నాయకులు నాగరాజు, ఖలీల్ లు పిలుపునిచ్చారు. బుధవారం శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ ఆడిటోరియం నందు సిపిఐ మండల కార్యదర్శి నరసరావు అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష పార్టీల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఒకవైపు స్థానిక మంత్రిగారు మార్చి నెల చివరి వరకు నీళ్లు ఇస్తామని ప్రకటన చేసినప్పటికీ హంద్రీనీవా అధికారులు మాత్రం డిసెంబర్ నెల వరకే నీటి విడుదల అంటూ సర్వ్యూలర్ జారీ చేయడం ఏంటని ప్రశ్నించారు.మండలంలో రబీ సీజన్ కు సంబంధించి రైతులు వేల ఎకరాల్లో పంటలు వేసినప్పటికీ హంద్రీనీవా అధికారులు డిసెంబర్ వరకే సాగునీరు విడుదల అని జారీ చేసిన జీవో చూస్తుంటే  పంట చేతికందే వరకు నీళ్లు అందుతాయో లేదో అన్న నిస్సహాయతలో రైతులు ఉన్నారన్నారు.రబీ సాగుకు ముందే అధికారులు చెప్పి ఉంటే పంటలు సాగు చేసుకునే వాళ్ళు కాదు, రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కాదా అంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు.

Back to top button