Dewanakonda

మంత్రి హామీ మేరకు మార్చి చివరి వరకు నీళ్లు ఇవ్వాలి.

  • మంత్రి హామీ మేరకు మార్చి చివరి వరకు నీళ్లు ఇవ్వాలి.
  • రైతులకు నష్టం జరిగితే మంత్రి ఇంటిని ముట్టడిస్తాం.
  • ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె. జగన్నాధం

దేవనకొండ (ఆంధ్ర ప్రతిభ) 23 నవంబర్: నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరా గారు రైతులకు ఇచ్చిన హామీ అమలు చేయాలని, మార్చి చివరిదాకా  రైతులకు నీళ్ళు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె. జగన్నాధం  మంత్రి గారిని కోరారు. ఈ సందర్బంగా దేవనకొండ లో రైతుసంఘం   ఆధ్వర్యంలో జిల్లా సహాయకార్యదర్శి  ఎం. జగదీష్, మండల కార్యదర్శి శివశంకర్ మరియు రైతులు తో కలసి రైతులు వేసిన వేరుశెనగ పంటను  పరిశీలించడం జరిగింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మంత్రి గారి హామీ మేరకు రైతులు హంద్రీనివా ప్రాజెక్టు క్రింద తొమ్మిది వేల ఎకరాలు కు పైగా వేరుశెనగ, పప్పు శనగ, కూరగాయలు పంటలు సాగు చేశారు.పంటలు అన్ని కూడా విత్తనాలు విత్తి మొలకలు దశలో ఉన్నాయి. ఈ మొక్కలు పంట రావడానికి మరో మూడు నెలలు సమయం పడుతున్నది. కానీ హంద్రీనివా ప్రాజెక్టు అధికారులు జనవరి నెలలో నీళ్లు బంద్ చేస్తామని చెబుతున్నారు. ప్రకటనలు కూడా ఇచ్చారు. స్వయంగా రాష్ట్ర మంత్రి గారు మార్చి వరకు నీళ్ళు ఇస్తామని, పంటలు వేసుకోమని రైతులకు హామీ ఇచ్చిన వారం రోజులకే అధికారులు నీళ్లు ఇవ్వలేమని, శ్రీశైలం లో నీటి మట్టం తగ్గింది అని చెబుతూ నీళ్లు ఇవ్వడం లేదు అని అంటే రైతుల పంటలు పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీళ్లు వాడుకుంటూ రాయలసీమకు అన్యాయం చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడం లేదని అన్నారు.

Back to top button