Dewanakonda

హంద్రీ-నీవా నుండి రబి సీజన్ పూర్తి వరకు నీళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేయాలి

  • హంద్రీ-నీవా నుండి రబి సీజన్ పూర్తి వరకు నీళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేయాలి
  • మార్చి చివరి వరకు సాగు కు నీళ్లు ఇవ్వాలని తాసిల్దార్ కార్యాలయం ను నాలుగు గంటల పాటు దిగ్బంధించిన అఖిలపక్ష పార్టీలు
  • హంద్రీ-నీవా నుండి రైతులకు సాగునీరు కావాలని ప్రభుత్వ పెద్దలు గర్జించాలి..

ఆంధ్ర ప్రతిభ దేవనకొండ హంద్రీనీవా నుండి మార్చి చివరకి వరకు సాగునీరు ఇస్తామని ప్రభుత్వం వెంటనే  ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం నాడు దేవనకొండ తాసిల్దార్ కార్యాలయంను నాలుగు గంటలపాటు దిబ్బందనం చేశారు.మండలంలోని వందలాది ఎకరాల్లో ప్రభుత్వ పెద్దల మాటలు నమ్మి రబి సీజన్లో వేరుశనగ మరియు ఇతర పంటలు సాగు చేశారని తీరా డిసెంబర్ చివరి వరకే నిల్లిస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వము మార్చి చివరి వరకు నీళ్లు ఇవ్వకుంటే రైతుల ఆత్మహత్యలు శరణ్యమని దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని తెలిపారు. తాసిల్దార్ ముట్టడి కార్యక్రమం సందర్భంగా అఖిలపక్ష పార్టీల నాయకులు సీపీఐ మండల కార్యదర్శి ఎమ్. నరసారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.మద్దిలేటి శెట్టి, సిపిఎం జిల్లా నాయకులు బీ. వీరశేఖర్, తెలుగుదేశం పార్టీ నాయకులు బడిగింజల రంగన్న, జనసేన మబ్బుల్ భాష, కాంగ్రెస్ పార్టీ గొర్రెల శ్రీనివాసులు, లోక్సత్తా రాందాస్ గౌడ్ లు మాట్లాడుతూ.. రైతుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం చాలా బాధ్యత రహితంగా రైతుల పట్ల వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులు రబీ సీజన్లో విరివిగా పంటలు వేసుకొని తీరా ప్రభుత్వం నీళ్లు ఇవ్వదేమోనని  రైతులు ఆందోళన పడుతుంటే మంత్రి గుమ్మనూరు జయరాం స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు

Back to top button