panyam

స్వచ్ఛభారత్ కార్మికులకు పెండింగ్ వేతనాలను తక్షణమే ఇవ్వాలి,

  • స్వచ్ఛభారత్ కార్మికులకు పెండింగ్ వేతనాలను తక్షణమే ఇవ్వాలి,
  • జీవో నెంబర్ 680 ప్రకారం పదివేల వేతనం, ఇవ్వాలి.

పాణ్యం (పల్లెవెలుగు) 6 ఫిబ్రవరి, సోమవారం : సిఐటియు ఆధ్వర్యంలో మండల కేంద్రమైన , పాణ్యం లో ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర, స్వచ్ఛభారత్ కార్మికులతో ధర్నా చేసి తహశీల్దార్ మండల అభివృద్ధి అధికారు లకు, స్పందన కార్యక్రమంలో, సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా సిఐటియు ,మండల కార్యదర్శి కె భాస్కర్, మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్మికులు, గ్రామాలలో కాలువలు శుభ్రం చేసి ప్రజారోగ్యాన్ని పరీక్షిస్తూ కనీస అవసరాలు తీరుస్తున్నారు ,కాలువలు శుభ్రం చేయడం, బ్లీచింగ్ చల్లడం .చేతిపంపులు మరమ్మత్తులు. సచివాలయం శుభ్రం చేయడం. గ్రామాలలో అధికారులకు అందుబాటులో  ఉంటూ నిత్యం సేవలు చేస్తున్న, స్వచ్ఛభారత్ కార్మికులకు నెలనెలా జీతాలు అందక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు పనులు చెప్పి చేయించుకోవడం తప్ప స్వచ్ఛభారత్ కార్మికులకు సమస్యల పరిష్కారం చేయడం లేదు, కావున వెంటనే ,పెండింగ్ వేతనాలు ఇవ్వాలని సబ్బులు,చెప్పులు, నూనె ,చీపుర్లు ఇవ్వాలని, ఈ ఎస్ ఐ సౌకర్యం కల్పించాలని  రాజకీయ వేధింపులు ఆపాలని,జీవో నెంబర్ 680 ప్రకారము .10వేల .వేతనం ఇవ్వాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని. వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పుల్లయ్య, ప్రసాదు, జనార్ధన్ విజయుడు, శ్యామల ,డేవిడ్ ,తదితరులు పాల్గొన్నారు

deva dattu

Devadattu Reporter Panyam
Back to top button