
సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్ కు కోసిగి నారాయణ డిగ్రీ కాలేజీ విద్యార్థి ఈరన్న ఎంపిక.
సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్ కు కోసిగి నారాయణ డిగ్రీ కాలేజీ విద్యార్థి ఈరన్న ఎంపిక.
కోసిగి (పల్లెవేలుగు) 07 డిసెంబర్: గత వారంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల డోన్ నందు జరిగిన రాయలసీమ యూనివర్సిటీ అంతర్ కళాశాలల కబడ్డీ పోటీల నందు కోసిగి నారాయణ డిగ్రీ కాలేజీలొ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఈరన్న అత్యుత్తమ ప్రతిభ కనబరిచి డిసెంబర్ 7 నుండి 11 వరకు బెంగళూరులో జరుగుతున్న ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్ కబడ్డీ టోర్నమెంట్‌కు ఎంపికైనట్లు నారాయణ డిగ్రీ కాలేజ్ (కోసిగి) ప్రిన్సిపాల్ షేక్షావలి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కరస్పాండెంట్ హుస్సేనయ్య మాట్లాడుతూ మా కళాశాల విద్యార్థులు ఇటు చదువులోనూ ఆటల్లోనూ రాణిస్తూ కళాశాలకు మంచి గుర్తింపు తీసుకొస్తున్నారని భవిష్యత్తులో క్రీడలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని, క్రీడాకారులకు క్రీడల్లో మంచి తర్ఫీదును ఇస్తున్న ఫిజికల్ డైరెక్టర్ బాలకృష్ణను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ చౌడయ్య, వైస్ ప్రిన్సిపాల్ బాలాజీ, అధ్యాపకులు షేక్షావలి, ఇస్మాయిల్ ఇతర అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.