Dharmavaram

సూపర్ స్టార్ కృష్ణ ఆశయ సాధనాలకు మరింత కృషి చేస్తాం.. మేడాపురం వెంకటేష్

సూపర్ స్టార్ కృష్ణ ఆశయ సాధనాలకు మరింత కృషి చేస్తాం.. మేడాపురం వెంకటేష్

ధర్మవరం (పల్లెవెలుగు) 27 నవంబర్: సూపర్ స్టార్ కృష్ణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని, కృష్ణ ఆశయ సాధనాలకు మరింత కృషి చేస్తామని కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షులు, వైయస్సార్సీపి 25 వ వార్డ్ కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం రేగాటిపల్లి రోడ్డు ఆవరణం లోని వైయస్సార్ విగ్రహం వద్ద, సూపర్స్టార్ కృష్ణకు సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వందలాదిమంది అభిమానులతో పాటు 24 వ వార్డు గోరకాటి పురుషోత్తం రెడ్డి కూడా పాల్గొని, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మేడాపురం వెంకటేష్ మాట్లాడుతూ కృష్ణ ఆశయ సాధనలో పేద ప్రజలకు అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేయాలన్న తలంపుతోనే, తాము కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతో oదన్నారు. 29 రాష్ట్రాలలో కృష్ణ ఎంతగానో గుర్తింపు పొందారన్నారు. ఆనాడు వరద బాధితులను వేలాదిమందిని ఆదుకున్న మహానీయుడు కృష్ణ అన్నారు. సేవా తత్పరుడు, మహనీయుడు కృష్ణ సినీ పరిశ్రమకు లేకపోవడం తీరని లోటు అన్నారు. తాము కూడా అసోసియేషన్ తరపున నియోజకవర్గంలో కులమత బేధం అని తేడా లేకుండా మృతి చెందిన కుటుంబాలకు పదివేల రూపాయలు కూడా ఆర్థిక సహాయం ఇప్పటికీ చేయడం జరుగుతోo దన్నారు. మున్ముందు కూడా సేవా కార్యక్రమాలను మరింత వేగవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం వెయ్యి మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా వారు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అభిమానులు భాస్కర్, రమణ ,బీరే శ్రీరాములు, కొత్త శ్రీరాములు, జిక్రియా, టీచర్ కృష్ణారెడ్డి, రాజారెడ్డి, సాయినాథ్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, హుస్సేన్, మహేష్, రాజా, రమేష్, సూర్యనారాయణ, రామాంజి తదితరులు పాల్గొన్నారు.

chiranjeevi

Chiranjeevi Reporter,Dharmavaram, Satyasai District
Back to top button