nandyala

సీనియర్ జర్నలిస్టు అంకబాబుపై ఉన్న కేసులను ఎత్తివేయాలి – ఎపియుడబ్ల్యుజె డిమాండ్

సీనియర్ జర్నలిస్టు అంకబాబుపై ఉన్న కేసులను ఎత్తివేయాలి – ఎపియుడబ్ల్యుజె డిమాండ్

నంద్యాల (పల్లెవెలుగు) 24 సెప్టెంబర్: సీనియర్ జర్నలిస్టు అంకబాబుపై ఉన్న కేసులను ఎత్తివేయాలని ఎపియుడబ్ల్యుజె ఆధ్వర్యంలో నంద్యాల ఆర్డీవో శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎపియుడబ్ల్యుజె రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్యామ్ సుందర్ లాల్, సీనియర్ పాత్రికేయులు జనార్ధనరెడ్డి, చలం బాబు, జిల్లా నాయకులు ఉస్మాన్ భాష, రాజు, మధు, జావిద్ తో పాటు పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎపియుడబ్ల్యుజె ఆధ్వర్యంలో వివిధ పత్రికల్లో పలు హోదాల్లో పని చేసిన సీనియర్ జర్నలిస్ట్ 73 ఏళ్ల కొల్లు అంకబాబును సి.ఐ.డి అధికారులు అరెస్టు చేయడాన్ని ఎపియుడబ్ల్యుజె తీవ్రంగా ఖండిస్తోందని, అంకబాబు సోషల్ మీడియాలో ఓ పోస్టును మరొకరికి ఫార్వర్డ్ చేశారన్న అభియోగంలో సిఐడి అధికారులు ఆయన్ను అరెస్టు చేయడం దారుణమన్నారు. పలు పత్రికల్లో పని చేసిన అనుభవంతో పాటు న్యాయ విద్యను అభ్యసించిన సీనియర్ జర్నలిస్టును అరెస్టు చేయడం దారుణమని, అన్యాయాలను, అక్రమాలను వెలుగులోకి తీసేందుకు పోరాడే విలేకరులపై రాష్ట్ర ప్రభుత్వం కుయుక్తితో కుట్రలుకున్ని అరెస్టు చేయడాన్ని ఎపియుడబ్ల్యుజె  తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రభుత్వానికి, సామాన్య ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తున్న విలేకరులపై కేసులు పెట్టి, వేధించడం, అరెస్టులు చేయడం సరైంది కాదని ప్రభుత్వానికి తెలియజేస్తున్నామన్నారు. కావున తక్షణమే కొల్లు అంకబాబుపై ఉన్న కేసులను ఎత్తి వేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు (ఎ.పి.డబ్లు.జె) సంఘం డిమాండ్ చేస్తోందన్నారు.

 

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button