
Dharmavaram
సీతారామయ్య కళాశాలలో దసరా ఈనామ్ వసూలు దారుణం. ఎన్ ఎస్ యు ఐ
సీతారామయ్య కళాశాలలో దసరా ఈనామ్ వసూలు దారుణం. ఎన్ ఎస్ యు ఐ
ధర్మవరం (పల్లె వెలుగు) 22 సెప్టెంబర్: పట్టణంలోని సీతారామయ్య బాలికల కళాశాలలో దసరా ఈనామ్ వసూలు చేయడం దారుణమని ఎన్ఎస్ యుఐ పట్టణ అధ్యక్షుడు చైతన్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల నుండి దసరా ఇనాం పేరుతో 200 నుంచి 500 వరకు డబ్బులు వసూలు చేయడం విట్టూరంగా ఉందని, ఇనాము ఇవ్వని విద్యార్థులను, బస్సు ఎక్కనికుండా ఇబ్బంది పెట్టడం సరికాదని వారు మండిపడ్డారు. ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధికంగా డబ్బులు వసూలు చేస్తూ ఇలా పండుగ ఇనాము పేరుతో వసూలు చేయడం దుర్మార్గమైన చర్య అని తెలిపారు. అనంతరం ఆర్డిఓ తిప్పే నాయక్ వారు వినతి పత్రాన్ని అందజేసి, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నాయకులు మంజుల, నరేంద్ర, గణేష్, గిరి తదితరులు పాల్గొన్నారు.