Dharmavaram

సినీ రంగానికి కృష్ణ మృతి తీరని లోటు

  • సినీ రంగానికి కృష్ణ మృతి తీరని లోటు
  • కృష్ణా, మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు.. మేడాపురం వెంకటేష్

ధర్మవరం (పల్లెవెలుగు) 16 నవంబర్: సూపర్ స్టార్ కృష్ణ సి మృతి సినిమా రంగానికి తీరని లోటు అని, వారు సినిమా పరిశ్రమలకు చేసిన సేవలు మరువరానివని కృష్ణ అండ్ మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు మేడాపురం వెంకటేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున కృష్ణ మృతి పట్ల, పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద వారి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సినీ పరిశ్రమలో మకుటం లేని మా రాజుగా వెలిగాడని, పలు భాషల్లో కూడా నటించి ప్రేక్షకుల మనుషుల్లో స్థానం కల్పించుకున్నాడని తెలిపారు. పద్మాలయ స్టూడియోని స్థాపించి ఎందరో సినీ కార్మికులకు ఉపాధి కల్పించిన ఘనత కృష్ణ కే దక్కిందన్నారు. 350 సినిమాలకు పైగా నటించిన ఆయన, ఎప్పటికీ అభిమానుల హృదయాలలో నిలిచిపోతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, రమణ, గోవిందు, రామకృష్ణ, శ్రీరాములు, నరేష్ ,మహేష్, ఓబులేసు, భాష, వెంకట రాముడు, తదితరులు పాల్గొన్నారు.

chiranjeevi

Chiranjeevi Reporter,Dharmavaram, Satyasai District
Back to top button