
సనా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యం లో రోడ్డు సేఫ్టీ కార్యక్రమం
సనా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యం లో రోడ్డు సేఫ్టీ కార్యక్రమం
నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం, 21అక్టోబర్ : ఆళ్లగడ్డ తాలూకా, లారీ ఓనర్ల వెల్ఫేర్ అసోసియేషన్ వారి కార్యాలయం నందు, మినిస్టర్ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో, సనా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ వారి అధ్యక్షతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సై కే .పి. బి. వెంకట రెడ్డి అసోసియేషన్ అధ్యక్షులు సెక్రెటరీ ఏవి సుబ్బారెడ్డి, ట్రెజరర్, ఆన్సర్ భాష పాల్గొన్నారు, ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా, సనా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ అప్సర్ హుస్సేన్, రిసోర్స్ పర్సన్ గా కొమ్ముపాలెం శ్రీనివాస్ మరియు ఉబీద్, హుమ్మర్ భాష పాల్గొన్నారు. మోటార్ వెహికల్ 1988 చట్టం, నూతన అమెండ్మెంట్ 2019 చట్టం, చెబుతున్న విషయాలన్నీ ప్రతి డ్రైవర్ కు తెలుసుకోవాలని, ఇందులో 181 సెక్షన్ నుంచి 198 వరకు, ఫైన్ ఏ విధంగా ఉన్నాయో తెలియజేశారు. హైవే మార్గంలో ఎందుకు తెల్ల, ఎల్లో లైన్లో ఉంటాయో వాటితో పాటు సిగ్నల్స్ ఉంటాయి అవి డ్రైవర్ల కొరకు ఏర్పాటు చేయబడ్డాయి, వాటిని మనం అర్థం చేసుకోవాలి మరియు డ్రంక్ అండ్ డ్రైవ్, స్పీడ్, రాసింగ్, మెంటల్, ఫిజికల్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే ఎంత ఫీజు చెల్లించాలో అదేవిధంగా డ్రైవింగ్ చేయిస్తే కొత్త చట్టం సెక్షన్ 198 ప్రకారం 25 వేల తో పాటు మూడు సంవత్సరాలు జైలు శిక్ష ఓనర్లకు వేస్తారని అంతేకాకుండా ఆ మైనర్ కు 25 సంవత్సరాలు వచ్చేంతవరకు, లైసెన్స్ ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకుంటారని, చట్టాల గురించి వివరించి చెప్పారు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే పదివేల రూపాయలు ఫైన్ తో పాటు రెండు సంవత్సరాలు జైలు శిక్ష కూడా ఉంటాయని, రిసోర్స్ పర్సన్ కొమ్ము పాలెం శ్రీనివాస్ వివరించి చెప్పారు. ఈ కార్యక్రమంలో సమస్త అధ్యక్షులు అఫ్సర్ హుస్సేన్, ఆర్లగడ్డ ఎస్సై, వెంకట్ రెడ్డి, ప్రాక్టికల్ అంశాల గురించి ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాల గురించి, ఆరోగ్య విషయాల గురించి, కంటే చూపు గురించి చెక్ చేయించు కోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.