
సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలి ఆర్డిఓ తిప్పే నాయక్
సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలి ఆర్డిఓ తిప్పే నాయక్
ధర్మవరం (పల్లె వెలుగు) ధర్మవరం ప్రతి సచివాలయ ఉద్యోగస్తులు తప్పనిసరిగా యూనిఫారం ధరించాలని, అప్పుడే ప్రజలు ఉద్యోగస్తులను గుర్తించగలుగుతారని ఆర్డీవో తిప్పే నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ధర్మవరం పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల 14వ వార్డు 16వ వార్డు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తొలుత ఉద్యోగస్తుల హాజరు పట్టికను పరిశీలిస్తూ పేరు వారిగా వారు ఉన్నారా? లేదా? అన్న వాటిని తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వం నిర్వహిస్తున్న నవరత్నాల పథకాల వివరాల రికార్డులను పరిశీలిస్తూ ఎక్కడైనా పెండింగ్ ఉన్నాయా? అన్న వాటిని అడిగి తెలుసుకుని, పరిష్కార దిశలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉద్యోగస్తులు ఉద్యోగ విధి నిర్వహణలో కానీ లేదా ఇతర పనులపై బయటికి వెళ్లినప్పుడు మూమెంట్ రిజిస్టర్ను తప్పనిసరిగా అమలుపరచాలని సూచించారు. ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగస్తులు కీలక పాత్రలుగా వహించే విధంగా సేవలు అందించాలని తెలిపారు. సచివాలయాలకు వచ్చే ప్రతి వ్యక్తి యొక్క సమస్యను, షెడ్యూల్ తేదీ ప్రకారం తప్పనిసరిగా పరిష్కరించాలని, అవసరమైతే ముఖ్యమైన సమస్యలను కమిషనర్,తదితర అధికారుల వద్ద సమాచారాన్ని తెలియజేసి వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఉద్యోగ విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని తెలిపారు. సచివాలయానికి అడ్మిన్ ముఖ్యమైన వారని, వారి మార్గదర్శక ములో స్టాఫ్ చక్కగా సహాయ సహకారాలు అందించినప్పుడే సచివాలయానికి మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు. నిర్లక్ష్య భావన ఉండకుండా, ప్రజలకు సేవాభావముతో పనిచేస్తూ, విధులను నిర్వర్తించాలని తెలిపారు. ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను, అర్హులైన వారందరికీ వర్తింపజేశలా విధులను నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్లు గణేష్ మణికంఠ, హేమలత, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.