
సంక్షేమ పథకాలే అభివృద్ధికి కొలమానికం..వైయస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు వై.బాలనాగిరెడ్డి
సంక్షేమ పథకాలే అభివృద్ధికి కొలమానికం..వైయస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు వై.బాలనాగిరెడ్డి
నంద్యాల (పల్లెవేలుగు) 11 నవంబర్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే అభివృద్ధికి కొలమానికమని వైయస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు వై.బాలనాగిరెడ్డి అన్నారు. శుక్రవారం కోసిగి మండల పరిధిలోని చింతకుంట గ్రామంలో సర్పంచ్ శ్రీమతి యన్.పద్మ అధ్యక్షతన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి పాల్గొన్నారు.ప్రతి గడపకు వెళ్లి,అక్క,చెల్లి,అన్న, తమ్ముడిని,అవ్వతాతలను అప్యాయంగా పలకరిస్తూ, జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలు తీరును అడిగి తెలుసుకుంటూ, గ్రామంలో తీసుకోవాల్సిన అభివృద్ధి పనులకు అడిగి తెలుసుకుంటూ ఎమ్మెల్యే ముందుకు వెళ్ళడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ,సియం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారానే పార్టీలకు అతీతంగా ఆర్హతే ప్రామాణికంగా తీసుకొని,దళారీ వ్యవస్థ లేకుండా,నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులను జమచేయడం జరుగుతుందన్నారు.ప్రాథమిక పాఠశాలలో జగనన్న గోరుముద్దను పర్యవేక్షిస్తూ నాణ్యత కలిగిన ఆహారాన్ని మోను ప్రకారం అందిస్తున్నారా అని విద్యార్దులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం గ్రామ నాయకులు గజమాలతో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మండల ఇంచార్జీ మురళీ రెడ్డి ని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో తాహాశీల్దార్ రుద్రగౌడ్,ఏఓ రాజు,హౌసింగ్ ఏఈ షేక్షావలీ,ఈఓపీఆర్డీ అబ్దుల్ రషీద్,ఐసిడిఎస్ అధికారిణి నీలమ్మ,మండల సీనియర్ నాయకులు నాడిగేని నరసింహులు,యంపీపీ ఈరన్న,వైస్ యంపీపీ మాన్వి లక్ష్మి,మండల కన్వీనర్ బెట్టనగౌడ్,జగదీష్ స్వామి, మాణిక్యరాజు,కాంట్రాక్ట్ బసిరెడ్డి,బండ్ల గోవిందు,దొడ్డి నర్సన్న,గ్రామ నాయకులు ఈరన్న,చింతలయ్య, యం.వెంకటేష్,నరసింహులు, కె లక్ష్మయ్య,సచివాలయ సిబ్బంది మరియు వాలింటర్లు పాల్గొన్నారు.