Dharmavaram

శ్రీ సత్య సాయి జిల్లా కాపు సంక్షేమ సేన ఉపాధ్యక్షులుగా అడ్డగిరి శ్యామ్ కుమార్

శ్రీ సత్య సాయి జిల్లా కాపు సంక్షేమ సేన ఉపాధ్యక్షులుగా అడ్డగిరి శ్యామ్ కుమార్

ధర్మవరం (పల్లె వెలుగు) శ్రీ సత్య సాయి జిల్లా కాపు సంక్షేమ సేన ఉపాధ్యక్షులుగా ధర్మవరం పట్టణానికి చెందిన అడ్డగిరి  శ్యామ్ కుమార్ ను ఎంపిక చేసినట్లు వారు తెలియజేశారు. రాష్ట్ర కాపు సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానం ప్రకారం రాష్ట్ర అధ్యక్షులు చేగొండి హరిరామజోగయ్య ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా కాపు సంక్షేమ సేన ఉపాధ్యక్షులుగా నియమించారు. సంస్థ ఆశయాలు అభిలాష మేరకు శ్రీ సత్య సాయి జిల్లా కాపు సంక్షేమ సేన ఉపాధ్యక్షులుగా అప్పజెప్పిన బాధ్యతలను నిర్వహించి అందరి మన్ననలను పొందుపరచాలని ఆశించినట్లు తెలిపినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరి రామ జోగయ్య మరియు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ శ్రీనాథ్ , అనంతపురం ఆఫీస్ పేరూరు శ్రీనివాసులు అనంతపురం జిల్లా కాపు సంక్షేమ సేన అధ్యక్షులు దివాకర్  కు కృతజ్ఞతలు తెలిపారు.

chiranjeevi

Chiranjeevi Reporter,Dharmavaram, Satyasai District
Back to top button