
శ్రీ సత్యకృప మహిళా డిగ్రీ కళాశాలలో నాల్గవ విడత జగనన్న విద్యాదీవెన సంబరాలు.
శ్రీ సత్యకృప మహిళా డిగ్రీ కళాశాలలో నాల్గవ విడత జగనన్న విద్యాదీవెన సంబరాలు.
ధర్మవరం (పల్లెవెలుగు) 30 నవంబర్: పట్టణంలోని శ్రీ సత్యకృప మహిళా డిగ్రీ కళాశాలలో నాల్గవ విడత జగనన్న విద్యా దీవెన సంబరాలు జరిగాయి.ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ డోలా పెద్దిరెడ్డి మాట్లాడుతూ. దేశచరిత్రలోనే గుర్తుండిపోయే విధంగా పూర్తి ఫీజు రియంబర్స్ మెంట్ పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదువుకొని తల్లిదండ్రులు కలలను నెరవేర్చాలి అని ఉద్దేశ్యంతో “జగనన్న విద్యా దీవేన పథకం” ప్రవేశపెట్టారు కనుక బాగా చదువుకొని మంచి ఉద్యోగం పొంది సమాజంలో అందరి మన్ననలు పొందినప్పుడే జగనన్న విద్యా దీవెన పథకంకు సార్థకత అని తెలిపారు.ఇందుకుగాను కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున విద్యార్థులు హర్షం తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బి.సీవెల్ఫేర్ ఆఫీసర్ రాజకుళ్లాయప్ప, యం.పి.పి రమాదేవి,వెల్ఫేర్ అధికారులు, ఏ.ఓరమేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.