
nandyala
శ్రీ శక్తి అమ్మకి నృత్య ప్రదర్శన
శ్రీ శక్తి అమ్మకి నృత్య ప్రదర్శన
నంద్యాల (పల్లెవేలుగు) గురువారం ఈ రోజు శ్రీపురం స్వర్ణ దేవాలయం, వెల్లూర్ తమిళనాడు లో జరిగిన మహాపౌర్ణమి యాగం లో శ్రీ సాయి నాట్యాంజలి కూచిపూడి కళాక్షేత్రం వారు శ్రీ శక్తి అమ్మకి నృత్య ప్రదర్శన చేయడం జరిగింది. కళాక్షేత్రం నాట్య గురువు డా.పళ్లెంశెట్టి సురేష్ శిష్యబృందం తో విచ్చేసి శక్తి అమ్మకి నృత్య ప్రదర్శనచేసి అమ్మని సంతోషింప చేసారు. నృత్య ప్రదర్శన వీక్షించి అమ్మ సంతోషించి గురువు ని మరియు శిష్యులను ఆశీర్వదించి అభినందించి తీర్థ ప్రసాదాలు అందించారని నాట్య గురువు డా.పళ్లెంశెట్టి సురేష్ తెలిపారు।