
mantralayam
శ్రీ రాఘవేంద్ర స్వామి 351వ ఆరాధన ఉత్సవాలు ప్రారంభం.
శ్రీ రాఘవేంద్ర స్వామి 351వ ఆరాధన ఉత్సవాలు ప్రారంభం.
మంత్రాలయం (పల్లెవెలుగు) 11 ఆగష్టు: కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి గో, అశ్వ, ధాన్య పూజ నిర్వహించి, ధ్వజరోహణ కార్యక్రమంతో పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి 351వ ఆరాధన ఉత్సవాలకు అంకురార్పణ పలికారు. వేడుకలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంత్రాలయం సీఐ భాస్కర్, ఎస్ఐ వేణు గోపాల్ రాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.