nandyala

శ్రీ ధన్వంతరి నాయి బ్రాహ్మణ కార్తిక వనభోజనం మరియు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం

శ్రీ ధన్వంతరి నాయి బ్రాహ్మణ కార్తిక వనభోజనం మరియు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం

నంద్యాల (పల్లెవెలుగు) 16 నవంబర్: స్థానిక నంద్యాల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ కాలనీలో వెలసిన శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన్ సమేత త్యాగరాజస్వామి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి మరియు రిటైర్డ్ డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ ఊడుమల్పురం మల్లుగాళ్ల సుబ్బరాయుడు వారి శ్రీమతి ఊడుమాల్పురం మళ్ళుగాళ్ల విజయలక్ష్మి నంద్యాల శ్రీశైల దేవస్థానం పాలకమండలి సభ్యురాలు మరియు సీనియర్ జర్నలిస్ట్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళ సెక్రటరీ గుంతనాల నాగమణి వారి ఆధ్వర్యంలో శ్రీ సీతారామ లక్ష్మణ  హనుమాన్ సమేత త్యాగరాజ స్వామి దేవస్థానంలో శ్రీ ధన్వంతరి నాయి బ్రాహ్మణ కార్తిక వనభోజన మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా, నాదస్వరం, డోలు సన్నాయి వారి బృందం సంజామల వెంకటసుబ్బయ్య, కొండగట్టురు మూలరాముడు బొల్లవరం రమేష్ జాటూరు శ్రీధర్ వారిచే కార్యక్రమం, మరియు ఆ నాట్యాచార్యులు నరసింహులు వారి సహాయ సహకారాలతో చిన్నారులతో నాట్య కళా ప్రదర్శన, భగవద్గీత ప్రచారకులు, సి.మాధవ స్వామి, గాయకులు మరియు జర్నలిస్ట్ యు శివ కుమార్ నాయుడు వారిచే గాత్రకచేరి అంగరంగ వైభవంగా నిర్వహించి వారందరికీ రాష్ట్ర నాయి బ్రాహ్మణ మహిళ సెక్రెటరీ ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ గుంతనాల నాగమణి వారందరికీ శాలువాలు పూలమాలలతో సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి , విశిష్ట అతిథులు ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్ర ప్రదేశ్ సిద్ధవఠం యానాదయ్య, డాక్టర్ సర్వేపల్లి సారంగపాణి రిటైర్డ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆయుర్వేద కళాశాల హైదరాబాద్ వారు, 18వ వార్డు విశ్వ నగర్ వెండి కట్టు సుబ్బలక్ష్మమ్మ సుబ్బరాయుడు వైఎస్సార్సీపీ నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్, 14వ వార్డు వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ సరస్వతి నాగరాజు, నాయి బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం మరియు ఏ.ఈ. మద్దిలేటి గారి సుబ్రహ్మణ్యం, నంద్యాల నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు దుర్వేసి వెంకటేశ్వర్లు, మధుసూదన్ జనరల్ సెక్రెటరీ నాయి బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం, మల్లె  నాగ పుల్లయ్య నాయి బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం ట్రెజరర్, నాయి బ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాల అధ్యక్షులు శ్రీ నారాయణస్వామి ప్రకాష్,ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ అనంతపురం జిల్లా ఎం శ్రీనివాసులు డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆత్మకూరు కర్నూలు జిల్లా మంచి గాండ్ల రామ లక్ష్మణ్ డైరెక్టర్, పరదేశి సుబ్బయ్య జర్నలిస్ట్, ఎం. నాగరాజు నంద్యాల నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు నూనెపల్లె వారు తదితర నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిశ్రీ ధన్వంతరి నాయి బ్రాహ్మణ కార్తిక వనభోజనం మరియు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా వారు  మాట్లాడుతూ, శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత త్యాగరాజ స్వామి దేవస్థానం స్టేట్ బ్యాంక్ కాలనీ నంద్యాలలో వెలసిన దేవస్థానానికి తన వంతు సహాయంగా దారి అయితే నేమి కళ్యాణ మండపం, తదితర వసతి కార్యక్రమాలకు తన వంతు సహాయం అందిస్తానని సభాముఖంగా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ చైర్మన్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిద్ధవఠం యానాదయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణులకు జరిగిన అన్యాయాన్ని, ఎద్దేవ చేస్తూ, ఇప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయి బ్రాహ్మణులకు దాదాపు 200 కు పైగా ఇచ్చిన ఒక పాలకమండలి సభ్యులు అయితేనేమి బిసి కార్పొరేషన్ డైరెక్టర్లు అయితేనేమి, నాయి బ్రాహ్మణులకుషాపుకు పదివేల రూపాయలు 150 యూనిట్లు లోపు ఉన్నవారికి ఉచిత విద్యుత్తు బిల్లులు ఉచిత  సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడం జరిగినది. జీవో నెంబర్ 50 కుల దూషణ బిల్లును అమల్లోకి తీసుకొని వచ్చి ఎవరైనా దూషిస్తే కఠిన చర్యలు తప్పవని నాయి బ్రాహ్మణులకు గౌరవ స్థానాన్ని కల్పించారని, మరొకసారి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి నంద్యాల స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కి ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి కి నాయి బ్రాహ్మణ సేవా సంఘం వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో అక్కడికి వచ్చిన విశిష్ట అతిధులందరిని  శాలువాలతో పూలమాలతో ఘనంగా సత్కరించడమే, కాకుండా, అక్కడికి విచ్చేసిన నాయి బ్రాహ్మణల కుటుంబాల పిల్లలు రాష్ట్రస్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారంగంలో రాణించి ఉత్తమ ప్రతిభను కనబరిచిన, మరియు రాష్ట్రస్థాయిలో చదువులలో తమ ప్రతిభను ఘనపరిచిన అందరికీ మరియు తమ నాట్యంతో నాట్య ప్రదర్శన చేసి ప్రతిభను కనపరిచిన చిన్నారులందరికీ చిరు సత్కారం జరిపించడం విశేషం.

Back to top button