Dhone

శ్రీ కృష్ణ మందిరం ప్రహరీ గోడ పునర్నిమిదించాలని పిలుపునిచ్చిన నాయకులు

  • శ్రీ కృష్ణ మందిరం ప్రహరీ గోడ పునర్నిమిదించాలని పిలుపునిచ్చిన నాయకులు
  • వై.నాగేశ్వరరావు యాదవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్

డోన్ (పల్లెవేలుగు) 10 అక్టోబర్: నేడు సాక్షి గ్రీన్ పార్క్ లేఅవుట్  ఐటిఐ కళాశాల కర్నూల్ రోడ్ నందు యాదవ నాయకులు సమావేశం నిర్వహించడం జరిగింది.  ఈ సమావేశంలో అయ్యన్న యాదవ్, కంది వరుణ్ కుమార్ యాదవ్, వెన్నర పామయ్య యాదవ్,  శ్రీనివాసులు, ప్రభాకర్ యాదవ్, చంద్రశేఖర్ యాదవ్, జయన్న యాదవ్, జి. చంద్రుడు, k. ప్రకాష్  యాదవ్ ,   సోమశేఖర్,  ఎన్ ప్రకాష్ యాదవ్,  రామాంజనేయులు,  బాలమద్దిరాజు మరియు బీసీ నాయకులు మొదలైనవారుపాల్గొన్నారు. ఈ సందర్భంగా వై. నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ సాక్షి గ్రీన్ పార్క్ లేఅవుట్ నందు మూడు సెంట్లలో   శ్రీకృష్ణ మందిరము నిర్మించుకోవడం జరిగింది. ఈ దేవాలయానికి ప్రహరీ గోడ కూడా నిర్మించడం జరిగింది.  ఇక్కడున్న అధికారుల,  ప్రజాపతినిధుల సహకారంతోనే ఈ మందిరం నిర్మించడం జరిగింది. అలాంటి మందిరం యొక్క ప్రహరీ గోడను ఈరోజ కూల్చివేశారు. ఈ రాష్ట్రంలో హిందూ మతం అనేది ఉండకూడదా? హిందువులు బ్రతక కూడదా? అని సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం.  హిందూ మతం మీద మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా వెంటనే ఈ ప్రహరీ గోడను పునర్ నిర్మించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం,  లేనియెడల  హిందువులందరితో ఒక కార్యచరణ జరిపి అన్ని ప్రతిపక్ష పార్టీల సహకారంతో పెద్ద ఎత్తున 20 వ తేదిన మున్సిపల్ కార్యాలయం  వెళ్లి మెమోరండం సమర్పించడం అనే అంశం,  అలాగే ప్రతి గ్రామానికి ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకాలను పాంప్లెట్ల రూపంలో ప్రతి హిందువుకి చేరే విధంగా  కార్యాచరణని, అలాగే ప్రహరీ గోడని పునర్ నిర్మించేదాకా రిలే నిరాహార దీక్షలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.

Back to top button