YSR KADAPA

శాస్త్ర ప్రచారంలో జెవివి కృషి అభినందనీయం

శాస్త్ర ప్రచారంలో జెవివి కృషి అభినందనీయం

యర్రగుంట్ల (పల్లె వెలుగు) జనవరి 7:స్థానిక ఎర్రగుంట్ల తాసిల్దార్ కార్యాలయంలో జన విజ్ఞాన వేదిక 2023 వార్షిక క్యాలెండర్ మరియు డైరీని యర్రగుంట్ల మండల తహసిల్దార్ ఏ నాగేశ్వరరావు  ఆవిష్కరించారని జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి సుజన కుమార్ తెలిపారు.  జెవివి గత 35 సంవత్సరాలుగా విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన కొరకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్ రాహుల్ అన్నారు.  చెకుముకి పరీక్షల ద్వారా విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీస్తు వారికి శాస్త్రీయ దృక్పథం పెంపొందిస్తుంది అని ఆయన అన్నారు.ఈ  సందర్భంగా జన విజ్ఞాన వేదిక గత 30 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో శాస్త్రీ అవగాహన కొరకు విద్యార్థుల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని మూఢనమ్మకాల నిర్మూలన కొరకు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాల బయన్న, వెంకటేశ్వర్లు తెలిపారు  ఈ నెల 21 22 తారీకులలో రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు కడపలోని జయరాజ్ గార్డెన్స్ తో నిర్వహిస్తున్నట్లు జనవిజ్ఞాన వేదిక నాయకులు తెలిపారు ఈ రాష్ట్రస్థాయి సంబరాల్లో ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్రస్థాయి సంబరాలలో శాస్త్రవేత్తలతో ముఖాముఖి సైన్స్ ఫెయిర్ సైన్స్ ఎగ్జిబిషన్ సైన్స్ కిట్ల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రస్థాయిలో జరిగే ఈ సంబరాలలో అన్ని జిల్లాల నుండి 300 మంది విద్యార్థులు, సైన్స్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొంటారని వారు తెలిపారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ లక్ష్మీదేవి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ తరుణ్ కుమార్,  జె వి వి నాయకులు వెంకట సుబ్బయ్య, షరీఫ్, హన్న ఎస్తేర్ తదితరులు పాల్గొన్నారు.

Nasib Basha

Nasib Basha, yerraguntla, Reporter, YSR Kadapa Dist,
Back to top button