
వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.. పుట్టపర్తి ఫుడ్ ఇన్స్పెక్టర్ రామ్ చందర్
వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.. పుట్టపర్తి ఫుడ్ ఇన్స్పెక్టర్ రామ్ చందర్
ధర్మవరం (పల్లె వెలుగు) పట్టణములో ఆహార పదార్థాల షాపులు, హోటల్లు నడుపుతున్న యజమానులు, పాలు విక్రయించే వారు అందరూ కూడా తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ తో పాటు ఫుడ్ లైసెన్స్ కూడా విధిగా ఉండాలని శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎస్. రామ్ చందర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం ధర్మవరం పట్టణంలోని మాధవ నగర్ లో గల మహేష్ మిల్క్ డైరీలో పాలలో కల్తీ జరుగుతున్న విషయం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, వి ఎఫ్ ఎం ఛానల్ నందు ప్రసారం కావడం జరిగిందని, ఇందులో భాగంగానే ఆకస్మిక తనిఖీ చేసి ప్రస్తుతం ఉన్న డైరీలో గల పాలను అనగా ఆవు, ఎనుము పాలు శాంపులను తీసుకొని లేబలేటరీకి పంపడం జరిగిందని వారు తెలిపారు. కల్తీ అని రుజువైన యెడల 2006 చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ కొన్ని రోజులు ముందు ఈ పాల డైరీలో కల్తీ అయినట్లు పట్టణమంతా దావనముల వ్యాపించింది. ఇప్పుడు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు, పర్యవేక్షణ చేయకపోవడంతోనే జిల్లా వ్యాప్తంగా డైరీలలో కల్తీ పాలు కూడా నిర్వహించడం జరుగుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా, శానిటరీ కార్యదర్శి ఉదయ్ కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.