Yemmiganur

వై.యస్.ఆర్ ఆంతర్ రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ ఇనగ్రేషన్ మ్యాచ్ ను ప్రారంభించిన..ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి

వై.యస్.ఆర్ ఆంతర్ రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ ఇనగ్రేషన్ మ్యాచ్ ను ప్రారంభించిన..ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి

 

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వీవర్స్ కాలనీ గ్రౌండ్ నందు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా వై యస్ ఆర్ ఆంతర్ రాష్ట్ర టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం రిబ్బన్ కట్ చేసి ఇనగ్రేషన్ మ్యాచ్ ను  ముఖ్య అతిథులుగా పాల్గొన్న నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు ప్రతిభ కనబర్చి విజయం సాధిం చేందుకు కృషి చేయాలని, క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలన్నారు. ఎమ్మిగనూరు శ్రీ నీలకంటేశ్వర స్వామి జాతర సందర్బంగా నెల రోజుల ముందే క్రీడాలకు అత్యంత ప్రాధాన్యం ఉందన్నారు. జరుగు పోటీలను ప్రతి ఒక్కరూ కనబర్చాలని సూచించారు. క్రికెట్ పోటీలతో పాటు ఎద్దుల పోటీలు, కబడ్డీ, ఫుట్ బాల్, వాలీ బాల్ తదితర  క్రీడలు జాతర సందర్బంగా ప్రతి ఏడాది మాదిరిగానే పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ మధుసూదన్,గ్రామీణ సిఐ మంజునాథ్, ఎంపీపీ కేశన్న, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కెయస్ రఘు, వైస్ చైర్మన్ డి. నజీర్ ఆహ్మద్, మున్సిపల్ కమీషనర్ ఎన్. గంగిరెడ్డి, జిల్లా వక్ఫ్ బోర్డు  ఉపాద్యాక్షులు రియాజ్ ఆహ్మద్, పట్టణ అధ్యక్షుడు బుట్టా రంగయ్య, ప్రధాన కార్యదర్శి యూకె. వీరేంద్ర, కోశాధికారి తారా రాజశేఖర్, అధికార ప్రతినిధి కె. సునీల్ కుమార్, టౌన్ బ్యాంక్ చైర్మన్ యూకె. రాజశేఖర్, కో ఆపరేషన్ స్టోర్ చైర్మన్ షబ్బీర్ ఆహ్మద్, కో ఆప్షన్ మెంబర్, కౌన్సిలర్లు, ఇన్ ఛార్జ్ లు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

K.Yallayya

K. Yallayya Reporter, Yemmiganuru,
Back to top button