kosigi

వైయస్సార్ ప్రభుత్వం లో దాచుకోవడం – దోచుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదు

  • వైయస్సార్ ప్రభుత్వం లో దాచుకోవడం – దోచుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదు
  • తెదేపా రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి

కోసిగి (పల్లెవేలుగు) 16 డిసెంబర్: రాష్ట్రంలో వైయస్సార్ పార్టీ నాయకులు దాచుకోవడం – దోచుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదు అని మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి సోదరుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కోసిగి మండలంలోని సాతూనూరు గ్రామంలో క్లస్టర్ ఇన్ చార్జ్ మండల కన్వీనర్ జ్ఞానేష్ అధ్వర్యంలో ఇదేంకర్మ-మనరాష్ట్రనికి కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వైయస్సార్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమి లేకనే మూడు రాజధాన్లు పేరుతో కులాలు ప్రాంతాలు మద్య చిచ్చు పెడుతూ తుగ్లక్ పాలన కొనసాగిస్తూ కాలయాపన చేస్తూ ప్రజలను మోసము చేస్తున్నారు తప్ప అభివృద్ధి గురించి ప్రజలు గురించి పట్టించుకోరు అని పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి అన్నారు కరెంట్ చార్జీలు, నిత్యావసర వస్తువులు రేట్లు, ప్రతి దానిపై రెట్లు అధికంగా పెంచి ప్రజలను మోసము చేస్తూన్న పార్టీ వైయస్సార్ పార్టీ అని వారు అన్నారు ప్రజలకు మంచి జరగాలంటే తెలుగు దేశం పార్టీ తోనే సాద్యం అని పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జ్ఞానేష్, తెలుగు యువత జిల్లా మీడియా కోర్డినేటర్ విజయ రామిరెడ్డి, జంపాపురం మాజీ సర్పంచ్ కృష్ణా రెడ్డి, సాతూనూరు నాయకులు ఉలిగయ్య, వెంకటేష్, రామిరెడ్డి, వారంగోపాల్, రాముడు, రవి, ఉసేని, నాగరాజు, పెద్ద భూంపల్లి జనార్ధన్, చిన్న భూంపల్లి చిన్న నరసింహులు, లక్ష్మయ్య, ఉసేని, వెంకటేష్, ఐ టిడిపి అధ్యక్షులు సల్మాన్ రాజు, భూంపల్లి నీలకంఠ, తదితరులు పాల్గొన్నారు

Mohammad Yousuf

Mohammad Yousuf Reporter, Kosigi, Kurnool DIst
Back to top button