Allagadda

వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం రెండో విడత కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి

వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం రెండో విడత కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ కేంద్రంలోని వైపీపీఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం రెండో విడత కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సభలో అక్టోబర్‌లో పంట కోతలు, రబీ అవసరాల కోసం ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 50.92 లక్షల మంది రైతన్నలకు రూ.2,096.04 కోట్ల రైతు భరోసా సాయాన్ని బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

నాలుగో ఏడాది వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం రెండో విడత పెట్టుబడి సాయం కింద నంద్యాల జిల్లాలోని 2,20, 497 మంది రైతులకు రూ.96.45 కోట్ల లబ్ది చేకూరింది.

అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఉదయం విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. స్వాగత కార్యక్రమం అనంతరం ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ నుండి హెలికాప్టర్ లో బయలు దేరి ఆళ్లగడ్డలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్ద ఉదయం 10:45 గంటలకు దిగి, కాన్వాయ్ లో ఉదయం 11:25 గంటలకు వైపీపీఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానానికి చేరుకున్నారు.

ఆళ్లగడ్డకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక కాన్వాయ్ ఇరువైపులా రహదారి వెంబడి పెద్ద సంఖ్యలో వేచి ఉన్న ప్రజలు అభివాదం చేశారు. ఆళ్లగడ్డకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి రావడంతో ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి సీఎంను చూసేందుకు ఉత్సాహం చూపారు. ఈ సందర్భంగా దారి పొడవునా ప్రజలు బారులు తీరి సీఎం జగన్ మోహన్ రెడ్డిని తిలకించారు. రోడ్డుకిరు వైపులా తనను చూడడానికి బారులుతీరి వేచి ఉన్న ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నవ్వుతూ, నమస్కరిస్తూ కాన్వాయ్ లో ముందుకు సాగటంతో ప్రజలు కూడా ప్రతి నమస్కారం చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

sridhar

Sridhar Allagadda, Reporter, Nandyal Dist.
Back to top button