nandyala

వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రౌండ్ టేబల్ సమావేశం

వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రౌండ్ టేబల్ సమావేశం

నంద్యాల (పల్లెవేలుగు) 21 అక్టోబర్: వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల ఇన్చార్జి ఆన్సర్ భాష ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10:30 గంటలకు భగత్ సింగ్ గ్రంథాలయం హాల్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యఅతిథిగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు కెయంఏ సుభాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిఎం జఫురుల్లా పాల్గొన్నారు. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ఉద్యమంలో భాగంగా ఆకలి రాజ్యం – నిరుద్యోగ భారతం అనే అంశంపై ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు , ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. సిపి ఐ (ఎం) నాయకులు బి. శంకరయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు మస్తాన్ ఖాన్, జమాత్ ఎ ఇస్లామి హింద్ నంద్యాల పట్టణ అధ్యక్షులు ఎస్ఏ సమద్, ఖిద్మత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు నవాజ్ ఖాన్, ఆయేషా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షులు ఎస్ అసదుల్లా, ఎం ఎస్ ఎఫ్ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు బాయికాటి బెనర్జీ మాదిగ, ఎమ్మార్పీఎస్ నంద్యాల జిల్లా నాయకుడు ఎస్ రామ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button