
kosigi
కనుల విందుగా సాగిన మార్లబండ అంజినేయ స్వామి రథోత్సవం
- కనుల విందుగా సాగిన మార్లబండ అంజినేయ స్వామి రథోత్సవం
- ముఖ్య అతిథిగా హాజరైన మండల ఇంచార్జీ మురళీ మోహన్ రెడ్డి
కోసిగి మండలం సజ్జలగుడ్డం గ్రామ ఇలవేల్పు శ్రీ మార్లబండ అంజినేయ స్వామి రథోత్సవం వీనుల విందుగా గురువారం సాయంత్రం సాగింది. ఈ రథోత్సవాన్ని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు మండల ఇంచార్జీ మురళీ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ముందుగా అంజినేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆలయ కమిటీ పెద్దలు అద్వరంలో చేపట్టిన రథోత్సవంలో పాల్గొన్న అనంతరం అన్నప్రాసాదంను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎంపీపీ ఈరన్న సినియర్ నాయకులు నరసింహులు జగదీష్ జగదీష్ స్వామి నాడెగెనీ నాగరాజు బుళ్ళి నర్సింహులు కోరివి నాలుగు మరియు సజ్జలగుడ్డం సర్పంచి. జె కె. నరసమ్మ నాయకులూ మల్లయ్య జాంబవంత ముక్కరయ్య వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.