nandyala

విభిన్న తరహాలో క్లాసిక్ జైలు రెస్టారెంట్ – ప్రారంభించిన ఎమ్మెల్యేలు కాటసాని, శిల్పా రవి

విభిన్న తరహాలో క్లాసిక్ జైలు రెస్టారెంట్
– ప్రారంభించిన ఎమ్మెల్యేలు కాటసాని, శిల్పా రవిలు

 

నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లో బుధవారం క్లాసిక్ జైలు రెస్టారెంట్ ను ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణం జిల్లా కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతుందని, ఇటువంటి విభిన్న తరహా రెస్టారెంట్లను ప్రజలు ఆదరించాలని కోరారు. రెస్టారెంట్ నిర్వాహకులు మధు సుధారాణి మాట్లాడుతూ ఈ రెస్టారెంట్లో జైలు వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, కేవలం మెట్రోపాలిటీ సిటీ నగరాలకే పరిమితమైనటువంటి విభిన్న తరహా రెస్టారెంట్ ను నంద్యాలకు పరిచయం చేయడం జరిగిందన్నారు. ఇందులో చైనీస్, తందూరి, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ ఐటమ్స్ రకాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి జడ్పిటిసి, కౌన్సిలర్ శ్యాంసుందర్ లాల్, సుధాకర్ రెడ్డి రెస్టారెంట్ నిర్వాహకుల బంధుమిత్రులు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button