
kosigi
విద్యుత్ హీటర్ కి విద్యార్థి బలి
విద్యుత్ హీటర్ కి విద్యార్థి బలి
కోసిగి (పల్లెవేలుగు) 26 అక్టోబర్: విద్యుత్ హీటర్ కి విద్యార్థి బలి వివరాల్లోకి వెళితే కోసిగి గ్రామం లోని ఐదవ వార్డు నందు నివాసం ఉంటున్న ఆర్ఎంపీ డాక్టర్ కోణం భీమరాజు, కోణం ఇంద్ర దంపతులకు ఇద్దరు సంతానం. స్నానానికి హీటర్ ఉపయోగించి నీటిని వేడి చేసే క్రమంలో నాలుగవ తరగతి చదువుతున్న వికాస్(9) వేడి అవుతున్న నీటిలో చేయి పెట్టడంతో బాలుడు ఉన్నపళంగా ఒక్కసారి కింద పడిపోయి, బాలుడు శ్వాస తీసుకోక పోవడంతో ఉన్నాఒక్క కుమారుడు చనిపోయాడని తెలుసుకున్న తల్లి, తండ్రి బోరున విలపించడం పలువురిని కంటతడి పెట్టించింది.