
విద్యుత్ సమస్యలపై అధికారులు దృష్టి సారించండి
- విద్యుత్ సమస్యలపై అధికారులు దృష్టి సారించండి
- సిసి రోడ్ల పెండింగ్ బిల్లులు త్వరితగతిన మంజూరుపై చర్చ
- యంపీపీ ఈరన్న అధ్యక్షతన కోసిగి మండల సర్వసభ్య సమావేశం.
కోసిగి మండల యంపీపీ ఈరన్న అధ్యక్షతన,యంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ అద్వరంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సభ్యుల మధ్య సర్వసభ్య సమావేశం జరిగింది.ఏడు అంశాల ఎజెండాతో సమావేశం మొదలుపెట్టగా,విద్యుత్ అధికారులు డిపాజిట్లు కట్టి, అమలు విషయంలో నిర్లక్ష్యం ఎందుకు అని ఇంచార్జీ ఏఈ గోవిందును సభ్యులు వివరణను అడిగి తెలుసు కున్నారు.పంచాయితీ రాజ్ వ్యవస్థ ద్వారా సిసి రోడ్ల నిర్మాణ బిల్లులను జాప్యంపై అధికారులు సమగ్రమైన సమాచారాన్ని అందించాలని కోరారు.గ్రామీణ నీటిపారుదల శాఖ ఏఈ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ,28గ్రామాలకు గాను 15కోట్లు మంజూరు అయ్యాయని,సర్వశిక్షా అభియాన్ ఏఈ రంగరాజు మండలంలోని నాడు నేడు కార్యక్రమం క్రింద 40 స్కూలుకు 26 మంజూరు కాగా,అందులో 4.23కోట్లు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు.ఉపాధి హామీ పథకంపై ఏపీఓ జయరాం మాట్లాడుతూ, వలసలపై ప్రత్యేకంగా జిల్లా అధికారులతో సమగ్రమైన నివేదికలతో రుపోందించి, అందుకుతగ్గ ప్రణాళికలు సిద్ధం చేయడం రూపకల్పన చేయడం జరిగిందని తెలిపిన అనంతరం సభ్యుల ఆమోదంతో సభను ముగించారు.