
విద్యుత్ శాఖ అధికారుల వత్తిళ్లకు బలైన ఎనర్జీ అసిస్టెంట్ కు నివాళి..
విద్యుత్ శాఖ అధికారుల వత్తిళ్లకు బలైన ఎనర్జీ అసిస్టెంట్ కు నివాళి..
కోసిగి (పల్లెవేలుగు) 24 నవంబర్: ఎనర్జీ అసిస్టెంట్లను స్తంభాలు ఎక్కించ వద్దు..పి.ఈరన్న, డివిజన్ గౌరవ అధ్యక్షులు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు).
విద్యుత్ శాఖ అధికారులు ఒత్తిళ్ల వల్ల తుంగభద్ర సబ్ స్టేషన్ దగ్గర 33/11 కె.వి. స్తంభం ఎక్కి పనిచేస్తుండగా ఎం.రమణ నాయక్,ఎనర్జీ అసిస్టెంట్ విద్యుత్ షాక్ గురై ఒళ్లంతా కాలి గాయాలతో చికిత్స పొందుతూ నేడు కర్నూలు గౌరీ గోపాల్ ఆస్పత్రి నందు మరణించినందున ఆయనకు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించింది.ఈ సందర్భంగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) గౌరవాధ్యక్షులు,సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు,పి. ఈరన్న,ఎనర్జీ అసిస్టెంట్ డివిజన్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, వి.నాగరాజు. కే.నాగన్న మాట్లాడుతూ అధికారుల ఒత్తిళ్లతో ఈ విధంగా అర్హత లేని వాళ్ళతో తంబాలెక్కించి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వంద మందిని బలి తీసుకోవడం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే అర్హత లేని వాళ్ళతో స్తంభాలు లెక్కించకూడదని డిమాండ్ చేశారు.అర్హత లేని వాళ్ళని స్తంభాలు ఎక్కించి ఇంకా ఎంత మంది ఎనర్జీ అసిస్టెంట్స్ ను బలి చేస్తారని విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నించారు.ఎటువంటి పరిస్థితులలో ఎనర్జీ అసిస్టెంట్స్ ను 33/11 కె.వి. స్తంభాలను ఎక్కించినట్లయితే విద్యుత్తు శాఖ కార్యాలయమును ముట్టడిస్తామని వారు అధికారులు హెచ్చరించారు. ఎనర్జీ అసిస్టెంట్ తో స్తంభాలు ఎక్కించి, పనిచేస్తున్న అధికారులను, రెగ్యులర్ సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు…