Ntr

విద్యా కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ కు వినతి పత్రం అందించిన RUTA

విద్యా కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ కు వినతి పత్రం అందించిన RUTA

విజయవాడ (పల్లెవెలుగు) 28 డిసెంబర్: రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ (రూట) రాష్ట్ర అధ్యక్షులు ఎమ్.ఎస్.ఇమామ్ బాషా నేతృత్వంలో నాయకులు పాఠశాల విద్యా కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ ను ఈ రోజు ఉదయం కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రం లోని ఉర్దూ సెక్షన్ లను అందులో పనిచేయు చున్న ఉర్దూ టీచర్ పోస్టులను క్రమబద్దీకరణ నుండి మినహాయించాలని, ఉర్దూ పాఠశాల లలోని 3,4,5 తరగతులను ఇంతకు ముందు తెలుగు, ఇంగ్లీష్ పాఠశాలల్లో కలిపిన వాటిని, తిరిగి ఉర్దూ ప్రాథమిక పాఠశాల ల్లోనే కొనసాగించాలని, ప్రతి తెలుగు, ఇంగ్లీష్ హైస్కూల్ లల్లో ఉర్దూ మీడియం పాఠశాలలలో ఉర్దూ విద్యార్థుల కొరకు ఒక ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ను మంజూరు చేసి భర్తీ చేయాలని, ఉర్దూ స్కూళ్ళలో గ్రేడ్ 2 హెచ్.ఎమ్., పోస్టుల్లో ఉర్దూ విషయ పరిజ్ఞానం ఉన్న టీచర్ల నే నియామకం చేయాలని క్రమబద్దీకరణ లో భాగంగా ఉర్దూ పాఠశాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి 1:15 గా పరిగణించాలని వినతి పత్రం లో పేర్కొన్నారు. కమీషనర్ ఈ సమస్యల పరిష్కారం కొరకు సానుకూలంగా స్పందించారని ఇమామ్ బాషా చెప్పారు. కమీషనర్ ను కలిసిన వారిలో రూట స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ లు అబ్దుల్ మునాఫ్, ముస్టాక్ హుస్సేన్,అసిస్టెంట్ ఫైనాన్స్ సెక్రెటరీ ఎమ్.డి.రఫీ,గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సమిఉల్ల,ఏలూరు జిల్లా నాయకులు షేక్ ఇస్మాయిల్ తదితరులు ఉన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button