nandyala

విద్యార్థుల ఫెలో షిప్లు రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ దారుణ ఆలోచన

  • విద్యార్థుల ఫెలో షిప్లు రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ దారుణ ఆలోచన
  • మొన్న మైనారిటీ ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ లు, నిన్న మైనారిటీ ఎంఫిల్, పిహెచ్ డి చదివే విద్యార్థుల ఫెలో షిప్లు రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ దారుణ ఆలోచన
  • మైనారిటీలైన, క్రిస్టియన్, ముస్లిం, జైన్, బుద్దిస్ట్ ల విద్యార్థులను చదువుకోకుండా అడ్డుకోవడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం
  • మైనారిటీలకు ఉన్నత  విద్యను దూరం చేసి మైనారిటీలను అణిచివేసేందుకే, కేంద్ర ప్రభుత్వం ఎంఫిల్, పిహెచ్ డి చేసే విద్యార్థులకు వచ్చే మౌలానా ఆజాద్ నేషనల్  ఫెలోషిప్ ను రద్దు చేయడం
  • ఎంఫిల్, పిహెచ్ డి చదివే మైనారిటీ  విద్యార్థులకు ఇచ్చే మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ ను పునరుద్దించకపోతే. కేంద్ర ప్రభుత్వం భరతం పడతం
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి, యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్. రియాజ్ డిమాండ్

 

స్థానిక నంద్యాల సిటీ లో విద్యార్థి నాయకులతో నిర్వహించిన కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్ధి యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ రియాజ్ మాట్లాడుతూ జాతీయ  వ్యాప్తంగా ఉన్న మైనారిటీలైన  ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన్, బౌద్ద ఎంఫిల్, పిహెచ్ డి చదివే విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం చాలా బాధాకరమైన విషయమని, ఆర్థికంగా మైనారిటీ విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమైనరని 2006 లో సచార్ కమిటి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అప్పటి కేంద్ర ప్రభుత్వం 2009 మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ పధకంను ప్రవేశ పెట్టి ఎంఫిల్, పిహెచ్ డి, చదివే మైనారిటీ విద్యార్థుల పరిశోధన కొనసాగనకు బుక్ లకు, ఫీల్డ్ విసిటింగ్ లకు, ఫోటో కాపీలకు, టిసిస్ లకు, ఖర్చులకు ఈ ఫెలోషిప్ లో వచ్చే డబ్బులతో కొన్నుకునే వారని, మైనారిటీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని దూరం చేయాలన్నా ఆలోచనతోనే 2017 లో కేంద్ర ప్రభుత్వం ఈ ఫెలోషిప్ ను పొందాలంటే నేషనల్ ఎలిజబుల్ టెస్ట్ (నెట్) పాస్ అవ్వాలనే నిబంధనలు పెట్టారన్నారు, ఇప్పుడు ఆ పథకనే ఎత్తి వేస్తున్నాట్లు గత కొన్ని రోజుల కిందట కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి సృతి ఇరానీ తెలియజేయడంతోనే కేంద్ర ప్రభుత్వం మైనారిటీలపై ఉన్న కుట్ర బయటపడిందని ఆయన తెలిపారు మైనారిటీలకు విద్యను దూరం చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఫెలోషిప్ ను రద్దు చేయడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేసిన మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ లను పునరుద్ధరించకపోతే కేంద్ర ప్రభుత్వ కార్యాలయలు ముట్టడి చేస్తామని రానున్న రోజుల్లో. మైనారిటీలు కేంద్ర ప్రభుత్వనికి తగిన బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా నాయకులు దివాకర్, తులసి తదితరులు పాల్గొన్నారు

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button