
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ
ధర్మవరం (పల్లె వెలుగు) సెప్టెంబర్ 17 ధర్మవరం పట్టణం, సుందరయ్య నగర్ లోని శ్రీ గణేష్ మునిసిపల్ ప్రాథమిక పాఠశాల లోని 500 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 8 నోటుపుస్తకాలు, పలకలు, పెన్నులు, మొదలగు విద్యాసామాగ్రి ని మడకం. చౌడయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మడకం. చంద్రశేఖర్ వారి కుటుంబ సభ్యులు శనివారం అందచేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా 100 మంది విద్యార్థులు ఉన్నపటి నుండి ప్రస్తుతం 500 మంది విద్యార్థులకు ఈ సేవా కార్యక్రమాన్ని పాఠశాలలో ప్రతి సంవత్సరం మడకం. చంద్రశేఖర్, తండ్రి జ్ఞాపకార్థం భాను ప్రసాద్ సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుందరయ్య నగర్ వార్డ్ కౌన్సిలర్ బాలిరెడ్డి, వైయస్సార్ పార్ట్ కార్యకర్త సానే. నరసింహా రెడ్డి , పాఠశాల పేరెంట్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు, పాఠశాల అభివృద్ధి సహకరదాతలు భాను ప్రసాద్, రవీంద్ర రెడ్డి మరియు పాఠశాల ఉపాద్యాయ బృందం హాజరైనారు.. ప్రధానోపాధ్యాయులు షర్ఫోద్దీన్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కి సహాయ సహకారాలు అందిస్తున్న మడకం. చంద్రశేఖర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేయడం జరిగింది. బాలిరెడ్డి ముఖ్య అథితులు మాట్లాడుతూ విద్యార్థులు విధ్యాసామాగ్రిని సక్రమంగా వినియోగించుకోవాలని, ఇలాంటి సేవాదృక్పథం ను విద్యార్థులు అలవర్చుకొని మంచి పౌరులుగా ఎదగాలని సూచించడం జరిగింది.