
విజ్ఞానాన్ని సత్య సంధతతో సద్వినియోగం చేయండి ప్రతిభావంతుల సత్కార సభలో జమాత్ అధ్యక్షులు సమద్
విజ్ఞానాన్ని సత్య సంధతతో సద్వినియోగం చేయండి ప్రతిభావంతుల సత్కార సభలో జమాత్ అధ్యక్షులు సమద్
నంద్యాల (పల్లెవెలుగు) 05 ఆగష్టు: విజ్ఞానం దైవ ప్రసాదితమని దాన్ని సత్య సంధతతో సద్వినియోగం చేయాలని జమాఆతె ఇస్లామీ హింద్ నంద్యాల అధ్యక్షులు షేక్ అబ్దుల్ సమద్ హితవు పలికారు. వైద్య రంగంలో ఎండి సాధించిన డా.పి.వి. నియాజ్ ను, కేరళా ఐఐటిలో ఎంటెక్ సాధించిన షేక్ షఫీవుల్లాను స్థానిక జమాఆతె ఇస్లామీ కార్యాలయంలో శాలువా కప్పి, మెమోంటో తో సత్కరించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సమద్ మాట్లాడుతూ నిరంతరం కృషి వలన డా.నియాజ్, షఫీవుల్లాతమ రంగంలో ప్రతిభావంతులయ్యారని, తాము సమాజానికి, దేశానికి సేవలు అందించినపుడే నిష్ణాతులు అవుతారన్నారు. యువత అనవసర సోషల్ మీడియాలో మునిగి పోక విజ్ఞానార్జనకు కృషి చేసి తమ కుటుంబానికి ఉపయుక్తం కావాలని కోరారు. సమావేశంలో డా.నియాజ్, షఫీవుల్లాతో పాటు ఎస్ఐఓ ఇమ్రాన్, జనాబ్ మోమీన్, ముస్తఫా, వి.సలీం, జక్రియా, ఫజ్లే హఖ్, నవాజ్ ఖాన్, ఫయాజ్, జమీలుద్దీన్, చాంద్, అన్సార్, ఫుర్ఖాన్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.