
విజ్ఞానపు లోగిల్లు గ్రంధాలయం
విజ్ఞానపు లోగిల్లు గ్రంధాలయం
ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు, 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్న మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డి.
కోసిగి (పల్లెవేలుగు) 18 నవంబర్: గ్రంధాలయం అంటే విజ్ఞానపు లోగిల్లు అని కోసిగి మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు స్థానిక స్త్రీ శక్తి భవనంలో మండల గ్రంధాలయ అధికారిణీ శ్రీమతి ఆశాజ్యోతి అధ్యక్షతన 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా వ్యాసరచన,వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినిలకు బహుమతుల ప్రదాన కార్యక్రమంకు ముఖ్యఅతిథిగా మురళీ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి విజ్ఞానాన్ని పెంపోందించెందుకు పుస్తక పఠనం ద్వారానే సాధ్యమని, గ్రంధాలయంలోని అనేక రచనలతో కూడిన పుస్తకాలు, సైన్స్, ఫాంటసీ, క్రైం, వినోదంతో కూడిన పుస్తకాలు, విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, వివిధ రకాల రోజువారి పత్రికలను అందుబాటులో ఉంచి ఎందరికో దోహదపడుతుందని అన్నారు. అనంతరం స్థానిక కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయ నందు ఈ వార్షికోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినిలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు యన్.నరసింహులు, యంపీపీ ఈరన్న, మండల కన్వీనర్ బెట్టనగౌడ్, మాణిక్య రాజు, కాంట్రాక్ట్ బసిరెడ్డి, కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయ ప్రిన్సిపాల్ పుష్పలత తదితరులు పాల్గొన్నారు.